నేను తీసుకునేది ప్యూర్ వైట్..: ఐటీ దాడులపై వెంకటేష్

Dil Raju: ప్రముఖ నిర్మాత, తెలంగాణ చలన చిత్ర సమాఖ్య అభివృద్ధి సంస్థ ఛైర్మన్ దిల్ రాజుకు చెందిన నివాసాలు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు చేపట్టిన దాడులు కలకలం రేపుతున్నాయి. ఒక్క దిల్ రాజు మాత్రమే కాకుండా పలు నిర్మాణ సంస్థలు, నిర్మాతలు, ప్రొడక్షన్ హౌస్‌లపై ఏకకాలంలో ఈ దాడులు చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది.

ఈ సంక్రాంతికి విడుదలైన రెండు భారీ సినిమాలు- గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం నిర్మాత దిల్ రాజునే. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కింద ఈ రెండూ తెరకెక్కాయి. మూడు రోజుల వ్యవధిలో విడుదల అయ్యాయి. ఈ నెల 10న గేమ్ ఛేంజర్, 14న సంక్రాంతికి వస్తున్నాం విడుదల అయ్యాయి.

Actor Venaktesh and film director Anil Ravipudi reacts on IT raids on Dil Raju

ఈ రెండు కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కినవే. అదే స్థాయిలోనే కలెక్షన్లు సాధించాయంటూ ప్రకటించుకోవడం ఈ ఐటీ దాడులకు కారణమైనట్లు చెబుతున్నారు. తనిఖీల సందర్భంగా ఐటీ అధికారులు దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీల సందర్భంగా అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ వరుస ఐటీ దాడులపై హీరో దగ్గుబాటి వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించడానికి నిరాకరించారు. దీనిపై మాట్లాడటానికి వాళ్లిద్దరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ విషయంలో ఏమీ తెలియనట్టే వ్యవహరించారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రెస్ మీట్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

దిల్ రాజు నివాసాలపై జరుగుతున్న ఐటీ దాడుల గురించి ఈ ప్రెస్ మీట్‌లో ఓ విలేకరి ప్రస్తావించారు. ఏకంగా నిర్మాతపై ఐటీ దాడులు జరిగే స్థాయికి ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్లు రావడం పట్ల మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించారు.

దీనిపై వెంకటేష్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కొత్తగా ఈ సమాచారం వింటున్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. అయిందా?, నిజమా? అంటూ విలేకరికి ఎదురు ప్రశ్న వేశారు. అన్నీ అవుతాయ్ గానీ బానే అవుతాయ్ అని బదులిచ్చారు.

రెమ్యునరేషన్ గురించి ప్రశ్నించగా- మిగతా వాళ్ల విషయాలు తనకు తెలియవు గానీ తాను తీసుకునేది ఫుల్ వైట్ (మనీ) అని తేల్చి చెప్పారు. అందులో కూడా వైట్ లో వైట్ మాత్రమే తీసుకుంటానని చెప్పారు. రెమ్యునరేషన్ కింద తీసుకునేది కొంతేనని, ఎక్కువ కాదని అన్నారు. ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోబోనని చెప్పారు.

పక్కనే అనిల్ రావిపూడి మాత్రం తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. సంక్రాంతికి వస్తున్నాం అని టైటిల్ పెట్టినందుకు వాళ్లు (ఐటీ) కూడా గట్టిగానే ఫిక్స్ అయినట్టున్నారు. మేము సంక్రాంతికి వస్తున్నాం అని వచ్చేశారు వాళ్లు కూడా.. అని నవ్వుతూ బదులిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+