హీరోయిన్ సాయిధన్సికతో హీరో విశాల్ నిశ్చితార్థం

స్టారో హీరో విశాల్ మొత్తానికి ఓ ఇంటివాడు అయిపోతున్నాడు. ప్రముఖ నటుడు విశాల్ 'కబాలి' ఫేమ్ హీరోయిన్ సాయి ధన్సికతో నిశ్చితార్థం చేసుకుని అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఈ నిశ్చితార్థ వేడుక చెన్నైలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అత్యంత నిరాడంబరంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త జంటకు సినీ పరిశ్రమతో పాటు అభిమానుల నుంచి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రేమ కథా నేపథ్యం
హీరో విశాల్, సాయి ధన్సికల లవ్ స్టోరీ కొద్ది నెలల క్రితమే వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఒక సినిమా ఫంక్షన్‌లో విశాల్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. మొదట ఈ ఇద్దరూ ఆగస్టు 29న వివాహం చేసుకుంటారని ప్రకటించారు. కానీ విశాల్ నడిగర్ సంఘం (నటుల సంఘం) కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున.. ఆ సంఘ భవనం ప్రారంభోత్సవం తర్వాతే వివాహం చేసుకుంటానని వెల్లడించారు. అందుకే, ముందుగా నిర్ణయించుకున్న తేదీన నిశ్చితార్థం మాత్రమే జరుపుకున్నారు.

Actor Vishal Gets Engaged to Actress Sai Dhanshika Wedding Soon

సాయి ధన్సిక గురించి కొన్ని విశేషాలు
తమిళనాడులోని తంజావూరుకు చెందిన సాయి ధన్సిక 2006లో 'మనతోడు మజైకాలం' అనే తమిళ సినిమాతో నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. మొదట్లో 'మెరీనా' అనే పేరుతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు. 2009లో 'కెంప' అనే సినిమాతో 'తనుషిక' పేరుతో కన్నడ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆమె సాయి ధన్సిక పేరుతోనే సినిమాలు చేస్తూ వచ్చారు. ముఖ్యంగా, రజనీకాంత్ హీరోగా వచ్చిన 'కబాలి' చిత్రంలో రజనీకాంత్ కూతురిగా నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు. తెలుగులో 'షికారు' సినిమాతో ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత 'అంతిమ తీర్పు', 'దక్షిణ' వంటి తెలుగు సినిమాల్లోనూ నటించారు. విశాల్-ధన్సిక ఇప్పటివరకు ఏ సినిమాలోనూ కలిసి నటించలేదు. అయితే, తమకు పదిహేనేళ్లుగా పరిచయం ఉందని, స్నేహితులుగా మొదలై అది ప్రేమగా మారిందని సాయి ధన్సిక వెల్లడించారు. త్వరలోనే వారి వివాహం గురించి కూడా అధికారిక ప్రకటన వెలువడుతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+