విజయ్ కు విషెస్ చెప్పడంలో మనోళ్లు తగ్గట్టేదు
తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రస్తుతం కొనసాగుతోంది. 210కు పైగా స్థానాల నుంచి అందిన తాజా ట్రెండ్స్ ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ తర్వాత, ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రస్తుతం వేగంగా సాగుతోంది. ప్రారంభం విజయ్ స్థాపించిన తమిళన వెట్రి కజగం పార్టీ దూకుడు కనిపించింది. దీర్ఘకాలంగా తమిళనాట పాతుకుపోయిన రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే పార్టీ అధికారాన్ని కోల్పోయే ప్రమాదంలో పడింది. ఏఐఏడీఎంకేదీ అదే పరిస్థితి.
ఈ విజయంతో విజయ్‌కు సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. తెలుగు హీరోలు నాని, నిఖిల్ సిద్ధార్థ, తమిళ నటుడు సిబి సత్యరాజ్, దర్శకుడు వెంకట్ ప్రభు, నటి అజు వర్గీస్ వంటి సెలెబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా ఆయనకు తమ శుభాకాంక్షలు తెలిజేస్తోన్నారు. "కంగ్రాట్స్ విజయ్ సర్. ముందు సందేహించారు, ఆ తర్వాత పట్టాభిషేకం చేశారు.." అని నాని పేర్కొన్నాడు.

"మొదట మా ఇంట్లో జరిగింది, ఇప్పుడు మన పక్కింట్లో జరుగుతోంది.." అని పరోక్షంగా ఏపీ ఎన్నికలను ఉద్దేశించి నాని వ్యాఖ్యానించాడు. అండర్‌డాగ్ గా గెలవడం ఎప్పుడూ గొప్ప విషయమేనని నాని పేర్కొన్నాడు. విజయ్ ను గెలిపించేలా తమిళనాడు ఓటర్లు తీసుకున్న నిర్ణయం ఎప్పుడూ తప్పు కాదనిపించేలా పాలన జరగాలని కోరుకున్నాడు. తమిళనాడు ప్రజలకు గొప్పగా పాలన అందించాలని ఆకాంక్షించాడు.
హీరో నిఖిల్ సిద్ధార్థ్ విజయ్ కు గ్రీటింగ్స్ చెప్పాడు. దళపతిగా విజయ్ ను అభివర్ణించాడు. మన భారతీయ సినిమా పరిశ్రమ నుండి తమిళనాడు రాజకీయాల్లో భారీ ముద్ర వేసి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం గర్వకారణమని నిఖిల్ పేర్కొన్నాడు. జన నాయగన్ చారిత్రక విజయం సాధించాడని పేర్కొన్నాడు.
విజయ్ ను అభినందిస్తూ నటి అజు వర్గీస్ ట్వీట్ చేశారు. "ధైర్యవంతులకే అదృష్టం దక్కుతుందనడానికి ఇదొక చారిత్రక ఉదాహరణ.." అని పేర్కొన్నారు. తమిళనాడు ప్రజలు విజయ్ కు ఇచ్చిన అతి గొప్ప గౌరవం ఇదేనని, ఓ చారిత్రక మార్పునకు శ్రీకారం చుట్టారని ట్వీట్ లో పేర్కొన్నారు. దర్శకుడు వెంకట్ ప్రభు.. విజయ్ ఫొటోతో ఉన్న జెండాను షేర్ చేశార. "ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్" అని రాశారు. మరో హీరో సిబి సత్యరాజ్ కూడా విజయ్ శుభాకాంక్షలు తెలిపాడు. "బ్లాస్టు! బ్లాస్టు!" అని తమిళంలో రాశారు.












Click it and Unblock the Notifications