Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్టార్ హీరోతో పెళ్లిపై ఓపెన్ అయిన మహేష్ బాబు చెల్లెలు

నటి అభినయ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచియం చేయాల్సిన పని లేదు. అభినయ తెలుగుతో పాటు తమిళ, మళయాళ సినిమాల్లో నటిస్తోంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన అభినయ, తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.ఆమెకు వినికిడి మరియు మాట లోపం అన్న సంగతి అందరికి తెలిసిందే.2009లో "నాడోడిగల్" చిత్రంతో నటనలోకి అడుగుపెట్టింది.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన "నేనింతే" అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు అభినయ పరిచయమైంది.

ఆమె "శంభో శివ శంభో", "దమ్ము", "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" వంటి అనేక ప్రసిద్ధ చిత్రాలలో నటించింది. ముఖ్యంగా "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" సినిమాలో మహేష్ బాబు చెల్లెలుగా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. "నాడోడిగల్" చిత్రానికి గానూ ఉత్తమ సహాయ నటిగా విజయ్ అవార్డును గెలుచుకుంది.తాజాగా విడుదలైన పానీ మూవీలో కూడా అభినయ తనదైన నటనతో ఆకట్టకుంది. సినిమా మొత్తం కూడా ఆమె చూట్టునే తిరుగుతుంది. నటనతో పాటు, అందంగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే గత కొంతకాలంగా అభినయ ఓ స్టార్ హీరోతో ప్రేమ ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Actress Abhinaya denies marriage news with Vishal

ఆ హీరో మరెవ్వరో కాదు విశాల్. విశాల్ , అభినయ ప్రేమించుకుంటున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.విశాల్, అభినయ ప్రేమలో ఉన్నారంటూ, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై నటి అభినయ స్పందించారు.మార్క్ ఆంటోనీ సినిమాలో విశాల్‌కు భార్యగా అభినయ నటించారు. అయితే విశాల్‌తో ప్రేమ, పెళ్లిపై వస్తోన్న వార్తలపై అభినయ స్పందించారు.రీల్‌ లైఫ్‌లో భార్యగా నటిస్తే రియల్‌ లైఫ్‌లో భార్య కాగలమా? అంటూ ఈ పుకార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారామె.

దీంతో విశాల్, అభినయల ప్రేమ, పెళ్లి అనే పుకార్లకు పుల్‌స్టాప్‌ పడినట్లయింది. 15 ఏళ్లుగా నాతో కలిసి చదువుకున్న స్నేహితుడిని ప్రేమిస్తున్నాను. అంతేకాదు త్వరలో అతడిని పెళ్లి కూడా చేసుకోబోతున్నానంటూ చెప్పుకొచ్చింది. అయితే తాను ప్రేమించిన ప్రియుడు పేరు మాత్రం ఈ భామ వెల్లడించలేదు. ప్రస్తుతం అభినయ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+