పెళ్లి కాకుండానే గర్భవతి అయిన నితిన్ హీరోయిన్..బేబీ పంప్‌తో దర్శనం
హీరోయిన్ అదా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. నటించిన తొలి సినిమాతోనే సూపర్ హిట్ కావడంతో అదా శర్మ కెరీర్ దూసుకుపోతుందని అనుకున్నారంతా. అయితే ఆమెకు అనుకున్నంత క్లిక్ కాలేకపోయింది. అదా శర్మకు తెలుగులో పెద్దగా ఆఫర్లు దక్కలేదు. ఇదే సమయంలో సెకండ్ హీరోయిన్‌గా నటించడంతో ఆమెకు మెయిన్ హీరోయిన్‌గా అవకాశాలు రాలేదు.
దీంతో బాలీవుడ్ బాటపట్టిన అదా శర్మ, అక్కడ బాగానే ఆఫర్లు పట్టేసింది. తన టాలెంట్‌తో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ముఖ్యంగా 'ది కేరళ స్టోరీ' సినిమా అదా శర్మ మంచి గుర్తించు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత అదా శర్మ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అదా శర్మ ఎప్పటికప్పడు తన వ్యక్తిగత విషయాలను సైతం పోస్ట్ చేస్తుంటుంది.

తన లేటెస్ట్ ఫొటోలతో పాటు, తన సినిమా విశేషాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది ఈ హాట్ బ్యూటీ. అయితే అదా శర్మ తాజాగా షేర్ చేసిన వీడియో సంచలనంగా మారింది. ఈ వీడియోలో అదా శర్మ బేబి బంప్‌తో కనిపించి అందరికి షాకిచ్చింది. ఈ వీడియో చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అదేంటి.. అదా శర్మ పెళ్లి కాకుండానే గర్భవతి అయిందా అంటూ షాక్‌కు గురయ్యారు.
అయితే ఇది అదా శర్మ నటించే సినిమాలో గెటప్ అని తెలియడంతో ఆమె అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ వీడియోకు కొన్ని ఎమోజిలు హింట్స్‌గా ఇస్తూ "ఈ మూవీ నేమ్ గెస్ చేయండి.. ఈ సినిమాలోని పరిస్థితులు చాలా ఒత్తిడితో కూడుకున్నవి కాబట్టి, నేను పూర్తిగా పరధ్యానం కాకుండా నా మనసును చెదరగొట్టేలా ఇలా క్రేజీగా బిహేవ్ చేస్తాను" అంటూ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications