రోజూ రాత్రి 9 గంటలనుంచి ఉదయం 4 వరకూ బార్‌లోనే నటి అదాశర్మ.. ఎందుకంటే?!
గతేడాది రూ.300 కోట్ల వరకూ కలెక్ట్ చేసిన కేరళ స్టోరీలో సినిమాలో లీడ్ రోల్ పోషించిన నటి అదాశర్మ విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. దాదాపు రూ. 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తర్వాత ఈ యంగ్ బ్యూటీ.. బస్తర్ అనే సినిమాతోపాటు సన్‌ఫ్లవర్ అనే సిరీస్‌లోనూ మంచి రోల్ చేసింది. ఆమె ఎంచుకుంటోన్న పాత్రలపై ప్రేక్షకులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా సన్‌ఫ్లవర్ వెబ్ సిరీస్‌కు సంబంధించి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సన్‌ఫ్లవర్ వెబ్‌సిరీస్‌లో ఓ బార్ డ్యాన్సర్ క్యారెక్టర్‌లో సందడి చేసిన అదాశర్మ ఆ క్యారెక్టర్ నేచురల్‌గా ఉండేందుకు తాను పడ్డ కష్టాన్ని చెప్పుకొచ్చింది.
నటనలో సహజత్వం కోసం..
బార్ డ్యాన్సర్‌గా తన పాత్రలో నేచురల్‌గా కనిపించేందుకు డ్యాన్స్ బార్‌లో ప్రతి క్షణాన్ని క్షుణ్ణంగా పరిశీలించిందట. అందుకోసం డ్యాన్స్ బార్‌లో గంటల కొద్ది గడిపిందట. సిరీస్ చూసే ప్రేక్షకుల కళ్లకు వాస్తవంగా అనిపించాలని, పర్‌ఫామెన్స్ సరిగా చేయలేపోతే ఎంత చేసినా ఆ నటనలో సహజత్వం కనిపించదని అభిప్రాయపడింది. అందుకోసమే తాను అక్కడి వాతావరణాన్ని అర్థం చేసుకునేందుకు బార్‌లోనే గడపాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. రోజూ రాత్రి 9 గంటలకు వెళ్లి ఉదయం 4 - 5 వరకూ బార్‌లోనే గడిపిందట.

ఆ సమయంలో బార్‌కు వచ్చే కస్టమర్లతో మాట్లాడం, అక్కడి వారి నడవడికను పరిశీలించడం ద్వారా తనకు పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ వచ్చిందని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. అదా శర్మ స్కూల్ పూర్తి కాగానే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. బాక్సాఫిసు వద్ద సూపర్ హిట్ అయిన.. విక్రమ్‌భట్ తెరకెక్కించిన '1920' సినిమాలో నటించినప్పుడు ఆమె వయస్సు 16 సంవత్సరాలే అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, హిందీ బాషలలో పలు చిత్రాల్లో అదాశర్మ నటించింది.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications