ఇంటరే కానీ.. ఇండియాలో టాప్ హీరోయిన్ !!
ఒక స్టార్ హీరోయిన్ కేవలం ఇంటర్ వరకు మాత్రమే చదివిందంటే చాలామందికి ఆశ్చర్యం కలగొచ్చు. కానీ బాలీవుడ్ స్టార్ Alia Bhatt విషయంలో అది నిజం. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టిన ఆమె, చదువుకంటే కెరీర్‌పై ఎక్కువ దృష్టి పెట్టి అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో అగ్రనటిగా ఎదిగింది. చదివింది ఇంటరే అయినా ఇండియాలో టాప్ హీరోయిన్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
దిగ్గజ దర్శకుడు Mahesh Bhatt కుమార్తెగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అలియా, Student of the Year సినిమాతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే గ్లామర్, నటన రెండింట్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. 'హైవే', 'రాజీ', 'గంగూబాయి కాఠియావాడి' వంటి చిత్రాల్లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తన స్థానాన్ని స్థిరపరుచుకుంది.

అలానే తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె RRR సినిమా ద్వారా చేరువైంది. దర్శకధీరుడు S. S. Rajamouli తెరకెక్కించిన ఈ పాన్-ఇండియా చిత్రంతో ఆమెకు దక్షిణాదిలో కూడా మంచి గుర్తింపు వచ్చింది. దీంతో భవిష్యత్తులో మరో తెలుగు సినిమాలో నటించే అవకాశముందనే ప్రచారం కూడా జరుగుతోంది.
ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే, బాలీవుడ్ నటుడు Ranbir Kapoor ను వివాహం చేసుకుని కుటుంబ జీవితాన్ని కూడా సాగిస్తుంది. పెళ్లి తర్వాత సినిమాల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తూ, కేవలం మంచి కథలు ఉన్న ప్రాజెక్ట్‌లనే అంగీకరిస్తోంది. అయితే ఆమె ఇటీవల నటించిన 'Jigra' సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో తర్వాత ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టింది. Yash Raj Films స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న 'ఆల్ఫా' చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోంది.
ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, ఇతర చిత్రాల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని మరింత మెరుగ్గా తెరకెక్కించేందుకు నిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి దశ పనుల్లో ఉందని సమాచారం. మరోవైపు ప్రముఖ దర్శకుడు Sanjay Leela Bhansali తెరకెక్కిస్తున్న 'లవ్ అండ్ వార్' సినిమాలో కూడా అలియా కీలక పాత్రలో నటిస్తోంది. ఇందులో Vicky Kaushal, రణబీర్ కపూర్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతుండగా, భారీ స్థాయిలో వీఎఫ్ఎక్స్ పనులు ఉండటంతో విడుదల ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి.
అలియా భట్ కేవలం హీరోయిన్ మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా తన ప్రతిభను నిరూపించుకుంటోంది. తన సొంత ప్రొడక్షన్ హౌస్ ద్వారా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను ప్రోత్సహిస్తోంది. అలాగే ఫ్యాషన్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లలో కూడా ఆమెకు భారీ డిమాండ్ ఉంది. సోషల్ మీడియాలో కూడా ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం ఆమె క్రేజ్‌కు నిదర్శనం.












Click it and Unblock the Notifications