అలాంటి పనులు చేస్తేనే హీరోయిన్‌గా అవకాశాలు..అనసూయ షాకింగ్ కామెంట్స్

నటి అనసూయ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె హీరోయిన్స్‌కు సంబంధించి చేసిన కామెంట్స్ తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. హీరోయిన్ పాత్రలు రావాలంటే షూటింగ్ పూర్తయ్యాక జరిగే పార్టీలకు హాజరు కావాల్సి ఉంటుందని అనసూయ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో కాకరేపుతున్నాయి. హీరోయిన్‌గా అవకాశాలు దక్కాలంటే పెద్ద యుద్దమే చేయాల్సి ఉంటుందని అనసూయ తెలిపారు.

టాలెంట్ ఉన్న అవకాశాలు వచ్చేది తక్కువే అని ఆమె వెల్లడించారు. షూటింగ్ తరువాత జరిగే నైట్ పార్టీలకు తాను దూరంగా ఉంటానని... బహుశా అందుకేనేమో తనకు హీరోయిన్‌గా అవకాశాలు రాలేదని అనసూయ చెప్పుకొచ్చారు. ఒకప్పుడు సినిమాలో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో మాత్రమే నటించాలని అనుకున్నానని .. కాని ఇప్పుడు ఏ పాత్రకైనా న్యాయం చేయలగలననే నమ్మకం వచ్చిందని అనసూయ చెప్పుకొచ్చింది.

Actress anasuya shocking comments on heroine roles

ఇక సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోలింగ్ గురించి కూడా ఈ సందర్భంగా మాట్లాడారామె. సోషల్ మీడియాలో తనని విమర్శించే వారు ఎంతమంది ఉన్నారో..నా పోస్టుల ద్వారా స్పూర్తి పొందే వారి సంఖ్య కూడా అదే రీతిలో ఉన్నారని అనసూయ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+