సినీ ప్రియులకు బ్యాడ్ న్యూస్..!!
Shefali Jariwala: ప్రముఖ బాలీవుడ్, టీవీ నటి షెఫాలి జరీవాలా మృతి చెందారు. ఆమె వయస్సు 42 సంవత్సరాలు. ఆమెకు భర్త పరాగ్ త్యాగి ఉన్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం రాలేదు. అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
2002 సంవత్సరంలో వచ్చిన 'కాంత లగా' పాటతో షెఫాలీ జరివాలా ప్రతి ఇంట్లోనూ తనదైన ముద్ర వేశారు. ఇప్పటికీ ప్రజలు ఈ రీమిక్స్ పాటను వింటారు. దీని తర్వాత, షెఫాలీ 2004లో అక్షయ్ కుమార్ మరియు సల్మాన్ ఖాన్‌లతో కలిసి 'ముజ్సే షాదీ కరోగి' చిత్రంలో కూడా కనిపించింది. 2013లో బిగ్ బాస్ టైటిల్ కోసం పోటీ పడ్డారు.

2004లో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. ముఝ్ సే షాదీ కరోగీ మూవీలో నటించారు. 2011లో కన్నడ మూవీ హుడుగరులో నటించారు. ఆ తరువాత ఎక్కువగా వెబ్, టీవీ షోలకు పరిమితం అయ్యారు. 2008లో బూగీ వూగీ, డాన్స్ షో నాచ్ బలియే సీజన్ 5, 7లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత ఏడాది సైతానీ రస్మే టీవీ సీరియల్ లో లీడ్ క్యారెక్టర్ పోషించారు.
షెఫాలి నటించిన రీ మిక్స్ డీజే సాంగ్.. కాంటా లగా2002లో దేశం మొత్తాన్నీ ఒక ఊపు ఊపింది. షెఫాలి సాంగ్ గా గుర్తింపు తెచ్చుకుందా పాట. 2005లో పరాగ్ త్యాగీని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ముంబై అంధేరీలో నివసిస్తోన్నారు. అర్ధరాత్రి గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications