'కాళ్లతో దారుణంగా తన్నేవాడు': మాజీ ప్రియుడి పైశాచికత్వాన్ని బయటపెట్టిన నటి!
ప్రముఖ నటి అర్చనా గౌతమ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి అత్యంత భయంకరమైన విషయాన్ని బయటపెట్టింది. ఎప్పుడూ నవ్వుతూ, చురుగ్గా కనిపించే అర్చన.. తన గత ప్రేమ ప్రయాణంలో శారీరక వేధింపులను అనుభవించానని చెబుతూ కన్నీటి పర్యంతమైంది. 'ద 50' అనే షోలో నటి యువికా చౌదరితో మాట్లాడుతూ ఆమె తన మాజీ ప్రియుడి అరాచకాలను వివరించింది.
ప్రేమ పేరుతో నరకం
అర్చన తన గతాన్ని గుర్తు చేసుకుంటూ.. "నేను బయటకు చాలా బోల్డ్‌గా కనిపిస్తాను కానీ, ప్రేమ విషయంలో చాలా బలహీనపడిపోతాను. నా మాజీ ప్రియుడు నన్ను ఎంత దారుణంగా కొట్టేవాడో చెప్పలేను. హోటల్ గదుల్లో నన్ను బూట్లతో, కాళ్లతో విచక్షణారహితంగా తన్నేవాడు. నేను గట్టిగా అరిచి ఎవరినైనా పిలుస్తానని బెదిరిస్తే, ఇంకా ఎక్కువగా కొట్టేవాడు" అని ఆవేదన వ్యక్తం చేసింది.

అతని కోసం అంతా చేసినా..
తను ప్రేమించిన వ్యక్తి కోసం ఎంతలా పరితపించిందో అర్చన వివరించింది. "అతను చూడటానికి అంత గొప్పగా ఏమీ ఉండడు. కానీ నేను అతని రూపాన్ని మార్చేశాను, హీరోలా తయారు చేశాను. అతని కోసం 100 జతల బట్టలు కొన్నాను. 24 గంటలు అతని గురించే ఆలోచించేదాన్ని. కానీ అంతా చేసినా నాకు దక్కింది మాత్రం చిత్రహింసలే. ఒకసారి మరో అమ్మాయి ముందే నన్ను దారుణంగా కొట్టాడు.. ఆ దెబ్బలకు భయపడి ఆ అమ్మాయి అక్కడి నుంచి పారిపోయింది" అని అర్చన పేర్కొంది.
డిప్రెషన్ లోకి వెళ్లాను..
ఈ దారుణమైన సంబంధం తన మానసిక స్థితిని పూర్తిగా దెబ్బతీసిందని అర్చన వెల్లడించింది. "ఆ వేధింపుల వల్ల నేను తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లాను. నా మానసిక సమతుల్యతను పూర్తిగా కోల్పోయాను. ఇటీవలే ఆ భయంకరమైన దశ నుండి బయటపడ్డాను" అని అర్చన చెప్పింది. అర్చన మాటలు విన్న యువికా చౌదరి స్పందిస్తూ.. "ఎవరైనా నిన్ను హింసిస్తుంటే అది ప్రేమ కాదు. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. ఇతరుల కంట్రోల్‌లో ఉంటూ నీ మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు" అని ఆమెకు ధైర్యం చెప్పింది. అర్చన ఎదుర్కొన్న ఈ గడ్డు పరిస్థితుల గురించి తెలిసి అభిమానులు సోషల్ మీడియాలో ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.












Click it and Unblock the Notifications