ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిన బ్యూటీ ..?
నటి దివి వద్త్య అంటే గుర్తు పట్టని వారుండరు. బిగ్ బాస్ రియాలిటీ షోతో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. అంతకుమందు కొన్ని సినిమాలు చేసినప్పటికీ రాని గుర్తింపు బిగ్‌బాస్ షోతో వచ్చింది. మహేష్ బాబు 'మహర్షి', చిరంజీవి 'గాడ్ ఫాదర్' అల్లు అర్జున్ 'పుష్ప-2'వంటి సినిమాల్లో నటించింది. మంచి హైట్ ,ఫిజిక్ దివి సొంతం. హీరోయిన్ మెటీరియల్ అయినప్పటికీ పెద్దగా అవకాశాలు రావడం లేదు. బిగ్ బాస్ ఇచ్చిన పాపులారిటీతో దివి కొన్ని వీడియో సాంగ్స్, వెబ్ సిరీస్‌లో నటించింది.
అయితే ఏవి కూడా అనుకున్న రేంజ్‌లో గుర్తింపు తీసుకురాలేకపోయాయి. ఇప్పటికీ సరైన బ్రేక్ కోసం చూస్తోంది ఈ తెలుగు అందం. దివి ఆ మధ్య హీరోయిన్‌గా లంబసింగి అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దివి తన జీవితంలో ఎదురైన కొన్ని ఘటన గురించి అభిమానులతో పంచుకుంది. సినిమాల్లో అవకాశాలు కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగానని. లావుగా ఉంటే సన్నగా అవ్వాలని, సన్నగా ఉంటే లావు అవ్వాలని.. ఇలా రకరకాల కండిషన్లు పెట్టేవారని చెప్పి వాపోయింది.

అయినప్పటికీ వాటిని తట్టుకుని తన శరీర ఆకృతిని మార్చుకున్నానని ఈ బ్యూటీ తెలిపింది. రవితేజ సినిమాలో లీడ్ క్యారెక్టర్‌కు దివిని ఎంపిక చేశారట. నీ హైట్, ఫిజిక్ సినిమాకు ఎసెట్ చెప్పారట. తీరా చూస్తే అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేశారని తెలిపి బాధపడింది. ఈ బాధల్ని భరించలేక ఇంటికెళ్లి షవర్ పెట్టుకొని నోరు మూసుకొని ఎన్నో సార్లు ఏడ్చానంటూ చెప్పుకొచ్చింది. రవితేజ సినిమాలో ఆఫర్ ఇచ్చినట్టే ఇచ్చి ఆ సినిమా నుంచి నన్ను తొలగించారని చెప్పి బాధపడింది.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో దివి ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. సినిమా విశేషాలతో, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది ఈ హాట్ బ్యూటీ. సోషల్ మీడియాలో అమ్మడును ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా అధికంగా ఉంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. దివి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్న తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
"ప్రేమ మాత్రమే.. ఇంకేమీ లేదు" అంటూ క్యాప్షన్ జోడించి, చెట్ల మధ్య మెట్లపై ఉన్న హాట్ ఫోటోలను ఆమె షేర్ చేశారు. ఈ ఫోటోలలో దివి తన థైస్ షోతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్నారు. అయితే దివి ఫొటోలపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.దివి ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందంటూ కొందరు కామెంట్ చేస్తుంటే..థైస్ షోతో సెగలు పుట్టిస్తుందంటూ మరికందరు రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం దివి షేర్ చేసిన ఫొటోలు నెట్టంట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications