వేశ్యలతో ఆ పని చేయండి చూద్దాం.. హీరోయిన్ సంచలన కామెంట్స్

నటి ఎస్తేర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.ఎస్తేర్ అందాలకు ప్రత్యేక అభిమానులు ఉన్నారంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కన్నడ సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత తెలుగులో హీరోయిన్‌గా ఇచ్చింది. పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా నటించిన వేయి అబ్బాదాలు సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా నటించింది.మరీ ముఖ్యంగా భీమవరం బుల్లోడులో నటించిన తర్వాత ఈ బ్యూటీ క్రేజ్ మరింత పెరిగింది.

ఇక తర్వాత గరం, జయ జానికి నాయక, జాలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, నయనం, ఐరావతం,69 సంస్కార్ కాలనీ, చాంగురే బంగారు రాజా, డేవిల్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ వంటి వాటిల్లో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. ఇక ప్రముఖ సింగర్ నోయెల్ సీన్‌ కొన్నాళ్లు ప్రేమయాణం సాగించిన ఈ భామ .. 2019లో అతన్ని వివాహం చేసుకుంది. పెళ్లైన కొద్ది నెలలకే అభిప్రాయభేదాలు రావడంతో అతనికి విడాకులిచ్చింది. పెళ్లి తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఎస్తేర్ గ్లామర్‌తో అదరగొట్టింది. ముఖ్యంగా 'రెక్కి' సినిమాలో ఎస్తేర్ ఓ రేంజ్‌లో రెచ్చిపోయి అందాలను ఆరబోసింది.

Actress Ester Noronha made shocking comments about prostitutes

ఈ సినిమా తర్వాత చాలామంది ఎస్తేర్‌కు అభిమానులుగా మారిపోయారు. ఆ మధ్య టెనెంట్‌లో ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌గా తన నటన, యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన ఎస్తేర్ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది. ఇప్పుడు దర్శకురాలిగా నిర్మాతగా మారింది ఎస్తేర్.ప్రస్తుతం హీరో ది వేకెంట్ హౌస్ అనే సినిమాను రూపొందిస్తుంది.

ఇదిలా ఉంటే ఎస్తేర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ..సమాజంలో వేశ్యలను చాలా చులకనగా చూస్తారని, అయితే వారు కావాలని ఆ వృత్తిలోకి రారని, ఆర్థిక ఇబ్బందులే అందుకు కారణమని పేర్కొన్నారు.సమాజం అంతలా మారాలనుకుంటే మగాళ్లు వేశ్యల దగ్గరికి వెళ్లి వారిని వాడుకోకుండానే డబ్బులు ఇచ్చి రావచ్చు కదా అని ప్రశ్నించారు.

అలాంటి పని ఏ మగాడు చేయడని, వారిపై కనీస జాలి కూడా ఉండదని ఆమె అన్నారు. డబ్బులు ఇచ్చి మరీ కోరిక తీర్చుకొని వస్తారు.. వేశ్యలు ఉన్నారంటే వారిని ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పటికీ సమాజంలో తిరుగుతున్నారు. మగాళ్లు వాళ్ళ దగ్గరికి పోకపోతే అసలు వేశ్యలే ఉండరు కదా.. పోయిన యూస్ చేసుకోకుండా డబ్బులు ఇచ్చే మగాళ్లు కూడా ఈ ప్రపంచంలో లేరంటూ ఎస్తేర్ నోరోన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+