రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ??

"ఫరియా అబ్దుల్లా".. 'జాతి రత్నాలు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ మూవీలోని తన ప్రత్యేకమైన హైట్, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఫరియాకు ఫుల్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్, లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్, రావణాసుర వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఫరియా తెలుగులో చివరిగా గతేడాది ఆ ఒక్కటీ అడక్కు, మత్తు వదలరా 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది.

కాగా మత్తు వదలరా 2 మూవీలో తన నటనకు గాను రీసెంట్ గానే 'గద్దర్ ఫిల్మ్ అవార్డు' సైతం గెలుచుకుంది. అలాగే ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'లో ఓ సాంగ్‌లో కూడా కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె ఒక తమిళ చిత్రంలో నటిస్తుండగా, తెలుగులో 'గుర్రం పాపిరెడ్డి' సినిమాలో కూడా కనిపించనుంది. అలానే అల్లరి నరేష్ 61వ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలానే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. ఎప్పటికప్పుడు తన ట్రెండీ ఫోటో షూట్స్ తో నెట్టింట రచ్చ లేపుతుంది. అయితే ఇన్నాళ్లు సాఫ్ట్ క్యారెక్టర్స్, కామెడీ పత్రాలు చేస్తూ వచ్చిన ఆమె.. ఈసారి రూట్ మార్చినట్టు తెలుస్తోంది.

actress-faria-abdullah-and-actor-thiruveer-movie-bhagavanthudu-teaser-goes-viral-on-media

ఏం మూవీ అంటే..

తెలుగు సినీ పరిశ్రమలో జార్జిరెడ్డి, పలాస, టక్ జగదీష్ తదితర సినిమాల్లో సహాయ నటుడిగా ఆకట్టుకున్నారు తిరువీర్. అలానే హీరోగా మసూద, పరేషాన్, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్రాలతో అలరించాడు. ఇప్పుడు లేటెస్ట్ గా తిరువీర్, ఫారియా ‌ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం "భగవంతుడు". జీజీ విహారి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని రవి పనస ఫిలిం కార్పొరేషన్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ వేసవిలో మూవీ విడుదల కానుంది.

కాగా రీసెంట్ గానే ఈ మూవీ టీజర్‌ను హీరోలు విశ్వక్‌సేన్‌, సందీప్‌కిషన్‌ ఆవిష్కరించారు. పల్నాడు బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఈ కథని.. రొమాంటిక్‌ పీరియాడిక్‌ పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. తిరువీర్, ఫరియా మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ కొత్త పాత్రలో ఫరియా ఎంతమేర మెప్పిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+