పెళ్లికి ముందే గర్భవతైన హీరోయిన్..? కారణం ఎవరో చెప్పేసిన హాట్ బ్యూటీ
ప్రముఖ సీరియల్ నటి, అందాల తార హీనా ఖాన్ ప్రస్తుతం ఒక సవాలుతో కూడిన దశను ఎదుర్కొంటోంది. 2024 జూన్ నుంచి స్టేజ్ 3 రొమ్ము క్యాన్సర్‌తో ఆమె ధైర్యంగా పోరాడుతోంది. ప్రస్తుతం తన పూర్తి దృష్టి ఆరోగ్యం, కోలుకోవడంపైనే కేంద్రీకరించింది. ఈ క్లిష్ట సమయంలో, వ్యక్తిగత జీవితంలో ఒక శుభవార్తను పంచుకుంటూ, పదమూడేళ్లుగా తనతో డేటింగ్ చేస్తున్న లాంగ్ టర్మ్ బాయ్‌ఫ్రెండ్ రాకీ జైస్వాల్‌ను ఈ ఏడాది జూన్ 4న వివాహం చేసుకుంది.
ఇక్కడి వరకు అంతా సవ్యంగానే ఉన్నా, ఇటీవల మీడియాకు కనిపించిన హీనా ఖాన్ పొట్ట కాస్త ఎత్తుగా కనిపించడంతో కొత్త ఊహాగానాలకు తెరలేచింది. ఆమె గర్భవతి అని, అందుకే క్యాన్సర్ చికిత్స పొందుతూనే హడావిడిగా పెళ్లి చేసుకుందని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ ప్రెగ్నెన్సీ రూమర్స్ ఆమెపై విమర్శల దాడికి దారితీశాయి.

అయితే, హీనా ఖాన్ అభిమానులు ఈ వార్తలను ఖండిస్తున్నారు. ఆమె ధరించిన దుస్తుల కారణంగా పొట్ట అలా కనిపించిందని, అంతకు మించి ఏమీ లేదని స్పష్టం చేస్తున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతూ, కొత్తగా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్న సమయంలో ఇలాంటి నిరాధారమైన వార్తలు ప్రచారం చేసి ఆమెను ఇబ్బంది పెట్టవద్దని అభిమానులు మీడియాను, నెటిజన్లను కోరుతున్నారు. ఈ సమయంలో ఆమెకు మానసిక స్థైర్యాన్ని, మద్దతును అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications