ఛీ ఏం మనుషులు మీరు.. మలయాళం బ్యూటీకి బిగ్ షాక్..?

కేరళలో జరిగిన ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ నటి హనీరోజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. అభిమానుల అత్యుత్సాహం హద్దులు దాటిన ఈ సంఘటనపై సినీ వర్గాలు, నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

వేడుకలో అల్లకల్లోలం..

వివరాల్లోకి వెళ్తే.. కేరళలో జరిగిన ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఈవెంట్‌కు హనీరోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెను చూసేందుకు భారీగా అభిమానులు చేరుకున్నారు. మొదట్లో సాధారణంగా సాగిన కార్యక్రమం, తర్వాత అభిమానులు సెల్ఫీల కోసం ఒక్కసారిగా ఎగబడటంతో గందరగోళంగా మారింది. ఈ సమయంలో కొందరు అభిమానులు అత్యుత్సాహంతో హనీరోజ్‌కు దగ్గరగా వెళ్లి సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేశారు.

actress-honey-rose-face-misbehaviour-from-fans-at-shopping-mall-inauguration-event-in-kerala

అయితే కొందరు అనుచితంగా ప్రవర్తిస్తూ ఆమెను తాకడం, ముఖ్యంగా నడుము భాగంలో స్పర్శించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో హనీరోజ్ తీవ్ర అసౌకర్యానికి గురై వెంటనే అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీలను గౌరవించకుండా ఇలా ప్రవర్తించడం తప్పని పలువురు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా మహిళా సెలబ్రిటీల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

హనీరోజ్ స్పందన?

ఈ ఘటనపై హనీరోజ్ నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు. అయితే ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఈ ఘటన మరోసారి సెలబ్రిటీల భద్రతపై చర్చకు దారితీసింది. భారీ జనసందోహం ఉన్న ఈవెంట్లలో సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోతే ఇలాంటి ఘటనలు జరగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మహిళా నటీమణుల విషయంలో నిర్వాహకులు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.ఇక హనీరోజ్ మలయాళ చిత్రసీమలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందారు. చిన్న వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె, తన నటనతో మంచి పేరు సంపాదించారు. Boyy Friennd సినిమాతో ఆమె సినీ ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత Trivandrum Lodge, Hotel California, Ring Master వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఇటీవల Veera Simha Reddy సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+