శృంగారం మంచి వ్యాయామమే.. చాలా మందిలో మెచ్యూరిటీ లేదు !!
ఇలియానా.. సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. 2006లో 'దేవదాస్' సినిమా ద్వారా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. తరువాత 'పోకిరి', 'జల్సా', 'కిక్', 'జులాయి' వంటి వరుస హిట్ చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. చివరగా 2018లో రవితేజతో కలిసి 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రంలో కనిపించింది. అలానే హిందీ చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. 'దో ఔర్ దో ప్యార్', 'బర్బార్ దేఖో', 'పఘలెట్' వంటి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ భామ.
ముంబైలో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ.. తన చిన్నారితో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంది ఈ గోవా బ్యూటీ. అలానే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఇలియానా తరచుగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలు, అనుభవాలను అభిమానులతో పంచుకుంటుంది. గతంలో ఇలియానా చేసిన కొన్ని బోల్డ్ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫిట్‌నెస్, వ్యాయామం గురించి మాట్లాడుతూ ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఆమె మాట్లాడుతూ.. బాడీ మేకోవర్ కోసం చాలా కష్టపడాలని తెలిపింది. ప్రతిరోజూ వ్యాయామం చేయాల్సిందేనని.. కొన్ని సార్లు శృంగారం కూడా మంచి వ్యాయామంలా పనిచేస్తుందని అన్నారు. అందులోనూ అలసిపోతాం కాబట్టి శరీరానికి మంచిదేనని వివరించింది. కష్టపడి చేసే ఏ పని అయినా మన బాడీకి మంచిదే అని.. కానీ కొందరు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరని వివరించింది. మెచ్యూరిటీతో ఆలోచిస్తే ఏదైనా కరెక్ట్ గా అర్థం అవుతుందని చెప్పుకొచ్చింది.
కాగా ఇలియానా 2023 మేలో మైఖేల్ డోలన్, ఇలియానా డీక్రూజ్ రహస్యంగా వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ల డేటింగ్ అనంతరం వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 2023 ఆగస్టులో ఇలియానా మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. అతడికి 'కోవా ఫీనిక్స్ డోలన్'గా నామకరణం చేశారు. 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రెండో బిడ్డకు ఇలియానా జన్మనిచ్చారు. రెండో బిడ్డకి 'కియాను రఫే డోలన్' అని పేరు పెట్టారు.
-
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
'బైకర్' ట్రైలర్ రిలీజ్.. శర్వానంద్ ఈసారి హిట్ కొట్టేశాడోచ్..! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
"మొన్న చెప్పి హిట్టు కొట్టా.. మళ్లీ చెప్తున్నా బంపర్ బ్లాక్ బస్టర్" -
తెలంగాణ గద్దర్ అవార్డుల్లో చిన్న సినిమా హవా! -
పాప టాలెంట్ చూపిస్తోందిగా..! -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
'ధురంధర్'కు కొత్త తలనొప్పి.. హైకోర్టుకు పంచాయితీ! -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !!












Click it and Unblock the Notifications