డ్రాగన్ బ్యూటీ "కయాదు లోహర్" కి బంపర్ ఆఫర్స్.. ఆ మూవీల్లో ఫిక్స్ ?
చిత్ర పరిశ్రమలో అదృష్టం ఎవరిని ఎప్పుడు వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. ఒక శుక్రవారం ఎవరి జీవితాన్ని ఎలా మారుస్తుందో.. ఓవర్ నైట్ లోనే ఎవరు స్టార్ అయిపోతారో అనేది అంతా సినిమాపైనే కాకుండా అదృష్టం పైన కూడా ఆధారపడి ఉంటుంది. నాలుగేళ్ల క్రితం చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి అరడజనుకు పైగా సినిమాల్లో నటించింది ఓ ముద్దుగుమ్మ. కానీ అనూహ్యంగా రీసెంట్ గా వచ్చిన ఓ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఇప్పుడు ఏకంగా వరుస ఆఫర్లతో దూసుకుపోతూ కేవలం రెండు నెలల్లోనే గత నాలుగేళ్లలో చేసిన సినిమాల సంఖ్యను బీట్ చేసింది.
ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరా అని అనుకుంటున్నారా ? డ్రాగన్ సినిమాతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన "కయాదు లోహర్". 2021లో వచ్చిన కన్నడ చిత్రం 'మొగిల్ పేట' సినిమాతో అరంగేట్రం చేసిన ఈమె.. ఆ తర్వాత 2022లో శ్రీవిష్ణు హీరోగా వచ్చిన 'అల్లూరి' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తార్వాత పలు భాషల్లో అరడజనుకు పైగా చిత్రాల్లో నటించింది. కానీ అవేవీ ఈ అమ్మడుకు అదృష్టాన్ని తెచ్చిపెట్టలేకపోయాయి.

కానీ ఇటీవల డైరెక్టర్ కం హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన "డ్రాగన్" సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది ఈ భామ. ఆమె గ్లామర్ తో పాటు నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోవడంతో.. తెలుగు, తమిళ్ భాషల్లో వరుసగా అవకాశాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే తమిళంలో యంగ్ హీరోలు అధర్వ, జీవి ప్రకాష్ సినిమాలలో నటిస్తున్న ఈమె శింబుతో పాటు ఒక ఇనిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు.
తెలుగులో సైతం నేచురల్ స్టార్ నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రాబోతున్న 'ది ప్యారడైజ్' సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ నటించనున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న 'ఫంకీ' సినిమాలో కూడా ఈమెనే తీసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో భారీ అంచనాలతో రాబోతున్న ఈ చిత్రాల్లో నటించే ఛాన్స్ రావడం పట్ల ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఈ చిత్రాలలో ఏ మూవీ సూపర్ హిట్ అయిన ఈ అమ్మడు కెరీర్ ఫుల్ స్వింగ్ లో దూసుకుపోవడం గ్యారంటీ అని కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications