అతని వల్ల తల్లిని అయ్యానంటూ హీరోయిన్ సంచలన పోస్ట్
ఇటీవల హీరోయిన్లు వరుసగా పెళ్లీ పీటలు ఎక్కుతున్నారు. కెరీర్ పీక్ టైంలో ఉండగానే సెలబ్రిటీలు పెళ్ళిళ్లు చేసుకుంటున్నారు. గతంలో పెళ్లి చేసుకుంటే ఆఫర్లు దక్కవనే భయంతో చాలామంది పెళ్లిళ్లకు దూరంగా ఉండేవారు. అయితే మారుతున్న కాలంతో పాటు, దర్శక,నిర్మాతల మైండ్ సెట్ కూడా మారుతోంది.పెళ్లి తర్వాత కూడా ఆఫర్లు అందిస్తున్నారు. దీంతో చాలామంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఆలియా భట్, దీపిక పదుకొనె, కత్రినా కైఫ్, కియారా అద్వానీ, కరీనా కపూర్ ఇలా బాలీవుడ్ హీరోయిన్లంతా కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
అలాగే పెళ్లి చేసుకున్న జంటలు తల్లిదండ్రులుగా మారడానికి ఎక్కువ సమయం తీసుకోవడం లేదు. వీరిలో కొంతమంది తల్లులుగా కూడా మారారు. ఇటీవలే కియారా అద్వానీ తాను తల్లి కాబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ తాను గర్భవతిని కాబోతున్నట్టు ప్రకటించింది.

నటి మాళవిక రాజ్ తల్లి కాబోతున్నారు. 'కభీ ఖుషీ కభీ గమ్' సినిమాతో బాలనటిగా అందరికీ సుపరిచితమైన మాళవిక, పలు సీరియల్స్‌లో హీరోయిన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. నటనపై ఎంతో ఆసక్తితో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె, ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు పొందలేకపోయారు. దీంతో ఆమె వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది.
ఆమె ప్రణవ్ బగ్గాను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ తమ వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. తాజాగా, మాళవిక తాను తల్లి కాబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. తన భర్తతో కలిసి వైట్ కలర్ దుస్తుల్లో ఫోటోషూట్ చేయించుకున్న మాళవిక, ప్రెగ్నెన్సీ కిట్‌ను చూపిస్తూ 'మామ్' అని రాసి ఉన్న క్యాప్‌ను ధరించారు. అలాగే, ఆమె భర్త 'డాడ్' అని టోపీ పెట్టుకుని మాళవికను ఎత్తుకున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు మాళవికకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications