ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీలో హీరోయిన్ ఆ బ్యూటీనే..!
గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఈ ఏడాది దేవర చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. మరోవైపు 'వార్ 2' సినిమాతో ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఎన్టీఆర్. వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తూ ఉండగా.. కీలక పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ కావడంతో ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే కొంత కాలంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ చిత్రం రాబోతుందని టాక్ నడుస్తోంది. ఆ ప్రాజెక్ట్‌ను సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించనున్నారు. అయితే ఆ మూవీని అల్లు అర్జున్ తో చేయాలని ప్లాన్ చేయగా.. ఇప్పుడు ఎన్టీఆర్ తో మూవీ చేయనున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చేలా నాగవంశీ ఇటీవల ఎక్స్ (ట్విటర్) లో షేర్ చేసిన ట్వీట్లు.. అలానే ఎన్టీఆర్ కూడా 'లార్డ్ మురుగన్' పుస్తకంతో కనిపించడంతో అభిమానులు సైతం పక్కా అని ఫిక్స్ అయిపోయారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఆ సినిమా పూర్తైన వెంటనే, ఎన్టీఆర్‌తో కలిసి మురుగన్ ఆధారిత చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. కాగా ఆనంద్ బాలసుబ్రమణియన్ రచించిన 'లార్డ్ మురుగన్' పుస్తకం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు భావిస్తున్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా మరో హీరోయిన్ సైతం ఆ బుక్ గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ మూవీలో హీరోయిన్‌గా ఎంపికైందా? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఆ హీరోయిన్ ఎవరంటే..?
నాగ చైతన్య సరసన "సాహసం శ్వాసగా సాగిపో" అనే సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మలయాళ నటి " మంజిమా మోహన్ ". 2019లో విడుదలైన ఎన్టీఆర్ 'కథానాయకుడు' లో నారా భువనేశ్వరి పాత్రలో కూడా ఆమె నటించారు. కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే కోలీవుడ్ హీరో గౌతమ్ కార్తిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరి వివాహం 2022లో గ్రాండ్ గా జరిగింది. ఆ తర్వాత నుంచి అడపాదడపా మాత్రమే సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. అయితే రెండు రోజుల క్రితం ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'లార్డ్ మురుగన్' పుస్తకం తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. దీంతో ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ చిత్రంలో హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యింది అని జోరుగా ప్రచారం నడుస్తోంది.

మరోవైపు మురుగన్ కి ఇద్దరు భార్యలు ఉన్నట్టు పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. వారిలో ఒకరు ఇంద్రుని కుమార్తె అయిన దేవసేన కాగా.. మరొకరు గిరిజన యువతి వల్లి. మరి ఇప్పుడు తెరకెక్కించబోయే చిత్రంలో ఈమెకు ఏ పాత్ర ఇస్తారో తెలియాలంటే ఎదురుచూడక తప్పదు.
-
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాన్ స్టాప్ నవ్వుల జాతర షురూ..! -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం











Click it and Unblock the Notifications