స్టార్ బ్యూటీ కాస్త క్రైస్తవ మత ప్రచారకురాలిగా మారిపోయిందిగా..!

"మోహిని" .. చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ నటి. 90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈమె అసలు పేరు మహాలక్ష్మి శ్రీనివాసన్. 1991లో ఈరమన రోజావే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలయ్య "ఆదిత్య 369" సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. బాలకృష్ణ, చిరంజీవి, మోహన్ బాబులతో పాటు మలయాళం స్టార్‌లు మోహన్‌లాల్, మమ్ముట్టి.. బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ లాంటి హీరోలతో నటించింది. వందకు పైగా సినిమాల్లో నటించి అన్ని భాషల్లోనూ ఆమె నటనకు మంచి పేరు వచ్చింది.

టాలీవుడ్ లో బాలయ్యతో క్లాసిక్ మూవీ 'ఆదిత్య 369'.. మెగాస్టార్ చిరంజీవితో బ్లాక్‌బస్టర్ 'హిట్లర్' చిత్రాలలో కనిపించింది. ఇక మోహిని చివరగా 2008లో 'ఇన్నత్తే చింతా విషయం'.. 2011లో 'కలెక్టర్' వంటి మలయాళం సినిమాల్లో కనిపించింది. అలానే బుల్లితెరపై కూడా 'కాదల్ పగడై', 'రాజ రాజేశ్వరి' వంటి టీవీ సీరియల్స్‌లో కూడా మెప్పించింది. తన అందం, అభినయంతో దక్షిణాదిలోనే క్రేజీ హీరోయిన్ గా.. 90స్‌ డ్రీమ్ గర్ల్ గా గుర్తింపు సంపాదించుకుంది.

actress-mohini-turned-into-christian-preacher-and-news-got-viral

అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే వివాహం చేసుకుంది. 1999లో పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. పెళ్లయ్యాక కూడా కొన్ని సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ అనూహ్యంగా ఇండస్ట్రీకి దూరమైంది. భర్తతో కలిసి అమెరికా వెళ్లిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.

పెళ్లి తర్వాత భర్త, పిల్లలతో లైఫ్ హ్యాపీగా సాగిపోతున్నా.. కానీ అకస్మాత్తుగా తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి డిప్రెషన్‌తో 7 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు గతంలో పలు ఇంటర్వ్యూ లలో వెల్లడించింది. అయితే తన మానసిక వేదనకు కారణం తన భర్త భరత్ కజిన్ చేయించిన చేతబడి (బ్లాక్ మ్యాజిక్) అని మోహిని సంచలన ఆరోపణలు చేయడం చిత్ర పరిశ్రమలో సంచలనం రేపాయి.

actress-mohini-turned-into-christian-preacher-and-news-got-viral

ఇక ఆ తర్వాత పరిస్థితుల కారణంగా అదే సమయంలో భర్తతోనూ విడాకులు తీసుకుంది. అంతే కాకుండా హిందూ కుటుంబంలో పుట్టిన తాను.. 2006లో క్రైస్తవ మతాన్ని స్వీకరించినట్టు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యింది. ప్రస్తుతం అమెరికాలోనే నివాసముంటూ మోహిని ప్రస్తుతం సింగిల్ మదర్ గా లైఫ్ లీడ్ చేస్తోన్నట్టు తెలిపింది. అలానే క్రైస్తవ మత ప్రచారకురాలిగా బిజి బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+