హీరో విజయ్ తెలివైనవాడు, అందుకే నేను దళపతి మీద పోటీ చేస్తా, గ్లామర్ డాల్, పొలిటికల్ లీడర్ !

ప్రముఖ తమిళ హీరో దళపతి విజయ్ కొత్త రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. తన సొంత రాజకీయ పార్టీ పేరును తమిళగ వెట్రి కళగం అని విజయ్ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల ప్రారంభానికి ముందే కొత్త రాజకీయ పార్టీ ప్రకటన చేసినా ఈసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడం లేదని హీరో విజయ్ స్పష్టం చేశారు. హీరో విజయ్ కొత్త పార్టీ విషయంలో గ్లామర్ డాల్ నమిత సంచలన వ్యాఖ్యలు చేశారు

2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నేతలు పోటీ చేస్తారని దళపతి విజయ్ ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉంటే హీరో విజయ్‌పై ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ రాజకీయ నాయకురాలు తెరపైకి వచ్చింది. ఆ మేడమ్ మరెవరో కాదు. బహుబాష నటి, గ్లామర డాల్, సింహమంటి చిన్నోడే అంటూ కుర్రకారును ఊపేసిన నటి నమిత. నటి నమిత ఇటీవల ఓ ప్రైవేట్ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

Actress Namitha said that she wants to contest elections against hero Vijay

ఆ సమయంలో హీరో దళపతి విజయ్ పై తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని తనకు కోరికగా ఉందని నటి నమిత ఆమె మనసులో మాటను వ్యక్తం చేశారు. ఆ ఇంటర్వ్యూలో దళపతి విజయ్ గురించి నమిత కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తమిళనాడులో దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దళపతి విజయ్ సినిమా అంటే ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటారు.

హీరో విజయ్ నటించిన సినిమాలు విడుదల అయితే థియేటర్ల ముందు జాతర కనిపిస్తుంది. ఆ సందర్బంలో హీరో విజయ్ అభిమానుల ఆనందానికి, వారి ఉత్సాహానికి అవధులు లేకుండాపోతాయి. ఫ్యాన్స్ లో ఇంత క్రేజ్ ఉన్న హీరో విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు. తాను ఇక ముందు మరో రెండు సినిమాల్లో నటిస్తానని విజయ్ ప్రకటించాడు. అందుకే మరో రెండేళ్లలో తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయోనని రాజకీయ విశ్లేషకులు ఎదురు చూస్తున్నారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్‌పై ఎవరు పోటీ చేస్తారనే విషయంపై బహుబాషా నటి, గ్లామర్ డాల్ నమిత ఓ ఇంటర్వ్యూలో ఆమె ప్రత్యక్ష రాజకీయ రంగ ప్రవేశం గురించి వెల్లడించారు. దళపతి విజయ్ పై పోటీ చేయాలనే ఆకాంక్షను నటి నమిత వ్యక్తం చేశారు. నటి నమిత తమిళనాడు బీజేపీ పార్టీ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తరపున నమిత చురుగ్గా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

తమిళనాడుకు చెందిన కేంద్ర మంత్రి ఎల్‌. మురుగన్‌ తరఫున నమిత ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. నీలగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎల్‌ మురుగన్‌ పోటీ చేయడంతో ఆయన తరపున నటి నమిత ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. నమితను చూసేందుకు జనం ఎగబడ్డారు. నమితకు తమిళనాడులో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. నటి నమితపై ప్రజలు పిచ్చి అభిమానం పెట్టుకున్నారు. నటి నమిత కోసం అభిమానులు గుడికూడా కట్టించారు.

Actress Namitha said that she wants to contest elections against hero Vijay

వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి నమిత పోటీ చేసే అవకాశం ఉంది. తాను హీరో విజయ్‌పై పోటీ చేస్తానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నమిత షాకింగ్ సమాచారం చెప్పారు. దళపతి విజయ్‌ రాజకీయ ప్రవేశంపై ఆ ఇంటర్వూలో నమితను అడిగిన సమయంలో ఆమె ఇలా సమాధానం ఇచ్చారు. విజయ్ చాలా తెలివైనవాడు, అందుకే ఆయన మీద తాను పోటీ చెయ్యాలని అనుకుంటున్నానని నమిత చెప్పడం తమిళనాడులో హాట్ టాపిక్ అయ్యింది.

రాజకీయాల్లో తెలివైన ప్రత్యర్థిపై పోటీ చేయాలని, అప్పుడు రాజకీయ ఎదుగుదల కూడా అవకాశం ఉంటుందని తాను అనుకుంటున్నానని నమిత చాలా తెలివిగా సమాధానం చెప్పింది. అయితే హీరో విజయ్ మీద నమిత పోటీ చేస్తే ఆమెకు డిపాజిట్లు కూడా రావని దళపతి ఫ్యాన్స్ అంటున్నారు. మొత్తం మీద లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న నమిత తాను హీరో విజయ్ మీద అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి వార్తల్లో నిలిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+