ఆ హీరోతో నజ్రియా "లవ్ స్టోరీ".. అందుకే విడాకుల రూమర్స్ !!
మలయాళ స్టార్ హీరోయిన్ నజ్రియా నజీమ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న వయసులోనే బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి, తన అమాయకమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మలయాళం ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. కాగా 'రాజారాణి' సినిమాతో కుర్రకారు హృదయాల్ని దోచుకున్న ఈ భామ.. ఆ ఒక్క సినిమాతో మలయాళంతో పాటు తెలుగు, తమిళం సహా మిగతా భాషల్లో అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. సినిమా కెరీర్ పీక్స్‌లో ఉన్న టైంలోనే ఆమె ప్రముఖ హీరో ఫాహద్ ఫజిల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఇక పెళ్లి తర్వాత కూడా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది ఈ భామ. తెలుగులో ఆమె "అంటే.. సుందరానికి" సినిమాలో నటించి టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వసూళ్లు సాధించకపోయినా, నజ్రియా నటన మాత్రం అందరినీ ఆకట్టుకుంది. అయితే కొంతకాలంగా సినిమాలకు, సోషల్ మీడియాకు గ్యాప్ ఇచ్చి వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇస్తుంది.

కానీ ఉన్నట్టుండి సోషల్ మీడియాలో దూరంగా ఉండాలని ప్రకటించడం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో ఫహద్‌తో ఆమెకు విభేదాలు ఉన్నాయనే పుకార్లు వెలువడ్డాయి. విడాకులు తీసుకుంటున్నారని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇటీవల ఇద్దరూ కలిసి పబ్లిక్ ఈవెంట్స్‌లో హాజరై, ఆ రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టారు.
ఇక ఇప్పుడు నజ్రియా తన ఆరోగ్యాన్ని సెట్ చేసుకొని మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో ది మద్రాస్ మిస్టరీ: ఫాల్ ఆఫ్ ఏ సూపర్ స్టార్ ఒకటి. 1940ల నాటి స్కాండల్ ఆధారంగా రూపొందిన పీరియడ్ థ్రిల్లర్ సిరీస్ రూపొందిస్తున్నారు. దర్శకుడు సూర్యప్రతాప్ తెరకెక్కించిన ఈ సిరీస్ త్వరలోనే సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
టోవినో థామస్‌తో లవ్ స్టోరీ..
అలానే మలయాళ స్టార్ హీరో టోవినో థామస్తో కలిసి నజ్రియా ఒక లవ్ స్టోరీలో నటిస్తోంది. ముహ్సిన్ పరారి దర్శకత్వంలో ఏవీఏ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. పెళ్లి తర్వాత మొదటిసారి నజ్రియా ఒక పూర్తి లవ్ స్టోరీలో కనిపించబోతోంది.

అంతే కాకుండా నజ్రియా ఎప్పుడూ తన పాత్రలను ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరగా ఉండే రోల్స్, లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టులపై ఎక్కువ ఆసక్తి చూపుతుంది. అందుకే ఆమెకు మలయాళం, తమిళం, తెలుగు మూడు ఇండస్ట్రీల్లోనూ అభిమానులు ఉన్నారు. కానీ టోవినోతో కలిసి లవ్ స్టోరీలో మంచి రొమాన్స్ కూడా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. మరి ఈ సినిమాతో నజ్రియా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం!












Click it and Unblock the Notifications