వేణు స్వామి దెబ్బకు మారిపోయిన హీరోయిన్ జాతకం
ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి గురించి తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరంటే అతిశేయోక్తి కాదు. సినీ , రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యారాయన. ముఖ్యంగా నాగ చైతన్య, సమంత జంట వీడిపోతారని ముందుగానే చెప్పి సంచలనం సృష్టించారు. వీరితో పాటు పలువురు సెలబ్రిటీల గురించి వేణు స్వామి చెప్పినవి చెప్పినట్టుగా జరగడంతో..సోషల్ మీడియాలో ఆయన పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు. అయితే ఆయన ఎన్నికల్లో విషయంలో చెప్పిన జాతకాలు ఫెయిల్ కావడంతో తీవ్ర విమర్శలను మూటగట్టుకున్నారు.
తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్‌లు సీఎం అవుతారని చెప్పిన వేణు స్వామి జాతకం తప్పని తేలాయి. దీంతో ఆయనపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. దీంతో ఇక మీదట తాను ప్రిడిక్షన్ చెప్పనని తేల్చేశారు. ఒకపక్క ఆయన జాతకాలు ఫెయిల్ అవుతున్నాయని తెలిసినిప్పటికి కూడా సెలబ్రిటీలు ఆయన్ను మాత్రం వదలడం లేదు. డింపుల్ హయాతి, రష్మిక, నిధి ఆగర్వాల్ వంటి హీరోయిన్లు వేణు స్వామి చేత జాతక దోష నివారణ పూజలు చేయించుకున్నారంటే ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

దీనిలో భాగంగానే వేణు స్వామితో పూజలు చేయించిన తర్వాత ఓ హీరోయిన్ జాతకం మారిపోయినట్టే కనిపిస్తోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు..నిధి ఆగర్వాల్.2017లో బాలీవుడ్ చిత్రం 'మున్నా మైఖేల్' ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది బాలీవుడ్‌లో అడుగుపెట్టి, తెలుగు, తమిళ చిత్రాలలో తనదైన ముద్ర వేసి, యువతరాన్ని ఆకట్టుకుంటుంది. మోడలింగ్ రంగం నుంచి వెండితెరకు పరిచయమై, తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. అయితే అమ్మడు కెరీర్‌లో ఇప్పటి వరకు సరైన హిట్ మాత్రం లేదు.
స్టార్ హీరో సినిమాల్లో నటించినప్పటికీ, హిట్ మాత్రం దక్కలేదు.అయితే వేణు స్వామితో పూజలు చేయించిన తర్వాత అమ్మడు కెరీర్ దూసుకుపోతుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న హరిహర వీరమల్లు, డార్లింగ్ ప్రభాస్ నటిస్తోన్న రాజాసాబ్ వంటి పెద్ద సినిమాల్లో అవకాశాలు చేజిక్కించుకుంది. ఈ సినిమాలు హిట్ అయితే నిధి ఆగర్వాల్ క్రేజ్ మరింత పెరుగుతుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఏది ఏమైనప్పటికీ వేణు స్వామితో పూజలు చేయించిన తర్వాత నిధి ఆగర్వాల్ జాతకం మారిపోయినట్టే కనిపిస్తోంది.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
45కి పైగా దేశాల్లో "దురంధర్ 2" నయా రికార్డ్.. పవన్ మూవీ సర్దేసుకోవడమే !! -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
కోకాపేట్ అల్లు సినిమాస్ లాంచ్ తేదీ అనౌన్స్: ఆ సినిమాలతో బోణీ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రోషన్ తో లవ్..?? ఓపెన్ అయిన 'కోర్ట్' మూవీ హీరోయిన్ శ్రీదేవి -
నా భర్తకు ఇవి ఉంటే చాలు: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
"20 ఏళ్ల క్రితం మీ అమ్మను చూసుంటే పెద్ద హీరోయిన్ ను చేసేవాడ్ని" -
కెమెరా ముందే వాంతులు చేసుకున్న చిన్నారి పెళ్లికూతురు.. అసలేమైంది! వీడియో -
"నేను ఎంతమందితో తిరిగినా అది నీ ప్రాబ్లెమ్ కాదు" -
లాగిపెట్టి కొట్టిన అపరిచితుడు.. నడిరోడ్డుపై ఏడుస్తూ హీరోయిన్ గోడు! వీడియో












Click it and Unblock the Notifications