ముహూర్తం ఫిక్స్.. గుడ్ న్యూస్ చెప్తానంటున్న మెగా డాటర్ నిహరిక !
మెగా ఫ్యామిలీ నుంచి సినీ రంగంలో అడుగుపెట్టింది " నిహారిక కొణిదెల ". నాగబాబు కుమార్తెగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ.. ముందుగా షార్ట్ ఫిల్మ్స్‌తో తన టాలెంట్‌ను నిరూపించింది. "ముద్దపప్పు అవకాయ" సహా పలు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుంది. ఆ తర్వాత బుల్లితెరపై సైతం యాంకర్ గా సత్తా చాటింది. ఈ గుర్తింపుతోనే నాగశౌర్యతో కలిసి "ఒక మనసు" చిత్రంలో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించకపోయినా.. విమర్శకుల ప్రశంసలు పొందగలిగింది. ఆ తర్వాత తమిళంతో పాటు తెలుగు చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు.
నటన నుంచి నిర్మాతగా ప్రయాణం..
హీరోయిన్ గా ఆశించినంత ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోవడంతో.. నిర్మాతగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. "పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్" అనే నిర్మాణ సంస్థను స్థాపించి.. వెబ్ సిరీస్‌లు, చిత్రాలను నిర్మించడం ప్రారంభించింది. "డెడ్ లైన్", "కమిటీ కుర్రోళ్లు" వంటి విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించి, కంటెంట్‌కి ప్రాధాన్యతనిచ్చే నిర్మాతగా నిలిచింది. "కమిటీ కుర్రోళ్లు" బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో పాటు.. ఆమెకు "బెస్ట్ ప్రొడ్యూసర్" అవార్డు కూడా దక్కింది.

ప్రస్తుతం నిహారిక తన రెండో సినిమా "ప్రొడక్షన్ నెం.2"పై దృష్టిసారించింది. ఈ చిత్రంలో సంగీత్ శోభన్ హీరోగా నటించగా, దానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమై, ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది.
సీక్రెట్ ప్రాజెక్ట్..
అయితే ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా తన బెస్ట్ ఫ్రెండ్ అంబటి భార్గవ్‌తో కలిసి ఒక "సీక్రెట్ ప్రాజెక్ట్" చేయబోతున్నట్లు నిహారిక ప్రకటించింది. ఇది కొత్త తరహా ప్రయోగం అని.. ఇందుకు సంబంధించి అధికారిక వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగిన వెబ్ సిరీస్ కావచ్చని తెలుస్తోంది. తెలుగు డిజిటల్ కంటెంట్‌కు గ్లోబల్ టచ్ ఇవ్వాలనే లక్ష్యంతో ఇది రూపొందుతున్నట్లు సమాచారం.
ఇక నిహారిక వ్యక్తిగత విషయాలకు వస్తే.. జీవితంలో ఎదురైన విభేదాల కారణంగా పెళ్లికి ముగింపు పలికింది. విడాకుల అనంతరం నిర్మాతగా మాత్రమే కాకుండా నటిగా కూడా పలు సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలతో ఫాలోయింగ్ పెంచుకుంటుంది. రీసెంట్ గానే ఆమె చీరకట్టులో పెళ్లికూతురు లుక్‌లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి.
-
ఆ స్టార్ హీరో నా క్లాస్ మెట్.. అన్నం పెట్టిన రోజుల్ని మర్చిపోలేను -
మళ్లీ వాయిదా.. "పెద్ది" మూవీ మరో 'హరిహర వీరమల్లు' కానుందా ??? -
పెళ్లిపై హీరో రామ్ కీలక ప్రకటన..!! -
ఆర్భాటంగా పెళ్లి ప్రకటన చేసిన స్టార్ హీరోయిన్.. తీరా చూస్తే షాకింగ్ ట్విస్ట్! -
మౌళి "దొంగనా కొడుకు".. మైత్రీ మూవీస్ సంచలన ప్రకటన..!! -
ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఖర్చు ఎంతో తెలుసా ? అన్నీ వెరైటీలా ?? -
అందరి ముందే నడుం గిల్లాడంటూ ఏడ్చేసిన తెలుగు బ్యూటీ.. -
ఎన్టీఆర్ మూవీలో రామ్ చరణ్ హీరోయిన్.. నీల్ ప్లాన్ గట్టిగానే !! -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
సిగ్గు లేదా మీకు.. ఇంత కక్కుర్తా.. ఆమెకు బాగా కలిసొచ్చిన నెగిటివ్ పబ్లిసిటీ !! -
రూ.10 కోట్లు బడ్జెట్.. 10 రోజుల్లోనే 160 కోట్లకు పైగా కలెక్షన్స్ !!












Click it and Unblock the Notifications