హీరోకు వ్యతిరేకంగా సాక్షం చెప్పిన నటి, హత్య కేసులో బాయ్ ఫ్రెండ్ ను ఇరికించి?

రేణుకాస్వామి హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శ్యాండిల్ వుడ్ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడతో సహా మొత్తం 17 మంది జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నారు. ఈసారి నటి పవిత్ర గౌడను విచారించినప్పుడు నేను రేణుకాస్వామిని చెప్పుతో మాత్రమే కొట్టానని, అయితే దర్శన్ నా ముందే రేణుకాస్వామిపై ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడని సాక్షం చెప్పిందని వెలుగు చూడటం కలకలం రేపుతోంది.రేణుకాస్వామి హత్య కేసులో ఏ1 నిందితురాలు పవిత్ర గౌడ పోలీసుల ఎదుట ఇలా సాక్షం చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహంతో నటి పవిత్ర గౌడ ఆమె బాయ్ ఫ్రెండ్ నటుడు దర్శన్ తదితరులకు చెప్పింది. ఈ సందర్బంలో హీరో దర్శన్ గ్యాంగ్ చిత్రదుర్గలో రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి బెంగళూరుకు తీసుకు వచ్చి తరువాత దారుణంగా దాడి చేసి హత్య చేశారని పోలీసుల దగ్గర సాక్షాలు ఉన్నాయి.

Actress Pavitra Gowda gave evidence to the police against hero Darshan in the murder case

రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్, నటి పవిత్ర గౌడ సహా మొత్తం 17 మంది నిందితులు అండర్ ట్రయల్ ఖైదీలుగా జైలు పాలయ్యారు. జైలులో రోజుకో బాధను అనుభవిస్తున్న నటి పవిత్ర గౌడ వారం రోజుల్లోనే పోలీసుల ఎదుట ఆమె బాయ్ ఫ్రెండ్ దర్శన్ కు వ్యతిరేకంగా సాక్షం చెప్పిందని వెలుగు చూసింది. తన కోసం రేణుకాస్వామిని నటుడు దర్శన్‌ కొట్టాడు అని ఏమాత్రం ఆలోచించకుండా హీరో దర్శన్ కు వ్యతిరేకంగా నటి పవిత్ర గౌడ వాంగ్మూలం ఇచ్చిందని పోలీసు అధికారులు అంటున్నారు.

బెంగళూరులోని పట్టనగెరెలో షెడ్డులోకి తాను వెళ్లే సమయానికే అక్కడ హీరో దర్శన్ ఉన్నాడని, తరువాత నేను రేణుకాస్వామిని చెప్పుతో కొట్టానని, ఆ తర్వాత నటుడు దర్శన్ తన ఎదుటే రేణుకాస్వామిపై దాడి చేసినట్లు ఆమె అంగీకరించిందని పోలీసులు అంటున్నారు. ఈ దెబ్బతో నటి పవిత్ర గౌడ హీరో దర్శన్ మీద ఆరోపణలు చెయ్యడంతో ఆయనతో పాటు హీరో అనుచరులు షాక్ అయ్యారని తెలిసింది

ఇప్పటికే కన్నడ నటి పవిత్ర గౌడ ఆమె ప్రియుడు దర్శన్‌ కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చిందని తెలిసింది. 'నేను చెప్పుతో కొట్టిన మాట నిజమే, రేణుకాస్వామిపై దర్శన్ దాడి చేసింది నిజమే, నేను షెడ్డుకు వెళ్లకముందే దర్శన్ షెడ్డులో ఉన్నాడు' అని పవిత్ర గౌడ పోలీసుల వాంగ్మూలం ఇచ్చిందని కేసు దర్యాప్తు చేస్తున్న ఓ పోలీసు అధికారి కన్నడ మీడియాకు సమాచారం ఇచ్చారు. అయతే భార్య విజయలక్ష్మితో కుమారుడితో కలిసి సంతోషంగా జీవిస్తున్న హీరో దర్శన్ జీవితంలోకి నటి పవిత్ర గౌడ ఎంట్రీ ఇచ్చింది.

Actress Pavitra Gowda gave evidence to the police against hero Darshan in the murder case

హ్యాపీగా సినిమాలు తీసుకుంటూ కోట్ల రూపాయలు డబ్బులు సంపాధిస్తూ భార్య, కొడుకుతో సంతోషంగా జీవిస్తున్న ఛాలెంజిగ్ స్టార్ దర్శన్ జీవితంలోకి నటి పవిత్ర గౌడ ఎంట్రీ ఇచ్చిన తరువాత ఆయన జీవితం తల్లకిందులు అయిపోయింది. భార్య విజయలక్ష్మిని తన గర్ల్ ఫ్రెండ్ పవిత్ర గౌడ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టినా ప్రియురాలిని మాత్రం హీరో దర్శన్ బాగానే చూసుకున్నాడు.

అయితే తన కోసం భార్యను కూడా పట్టించుకోని హీరో దర్శన్ కు ఇప్పుడు పవిత్ర గౌడ ఎవ్వరూ ఊహించని షాక్ ఇచ్చింది. నటి పవిత్ర గౌడ చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి గురించి చెడుగా చెప్పకుండా ఉండివుంటే అసలు ఈ హత్య జరిగేదా ?, దర్శన్ జైలుకు వెళ్లేవాడా ? అని ఆయన అభిమానులు, సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి నటి పవిత్ర గౌడ ఆమె ప్రియుడు దర్శన్ కు వ్యతిరేకంగా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిందని వెలుగు చూడటం కలకలం రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+