ఆ హీరోతో నటించాలని ఉంది.. కానీ అలా మాత్రం కాదు !!
ఒకప్పటి స్టార్ హీరోయిన్ "రాశి" గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలనటి గానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోయిన్ గా మారారు. టాలీవుడ్ లో స్టార్ హీరోలతో నటించి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. అంతే కాకుండా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషలలో నటించి మెప్పించింది. మహేష్ బాబు నటించిన నిజం సినిమాలో నెగెటివ్ రోల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
కాగా పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నేళ్ల పాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది. ఇక రీసెంట్ గానే చాలా ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఆమె సినిమాలతో పాటు సీరియల్స్ లోనూ నటిస్తోంది. గిరిజా కళ్యాణం, జానకి కలగనలేదు వంటి సీరియల్స్ తో బుల్లితెర ఆడియెన్స్ కు కూడా బాగా చేరువయ్యారు. కాగా రీసెంట్ గానే ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రభాస్ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

రాశి ఏమన్నారంటే..?
ప్రభాస్ అంటే తనకు చెప్పలేనంత ఇష్టమని.. ఆయనతో కలిసి ఒక్క సినిమాలో అయినా నటించాలని ఆశ పడుతున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో ఛాన్స్ వచ్చినా ప్రభాస్ కు తల్లిగా మాత్రం నటించనని తెలిపారు. అలాగే అక్క, వదిన వంటి పాత్రలు వచ్చినా చేయనని.. హీరోయిన్‌గా నటించే ఛాన్స్ ఇవ్వరనుకోండి అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అంతే కాకుండా ప్రభాస్ సినిమాలు చూడటానికి మాత్రమే థియేటర్‌కి వెళ్తానని.. ఛత్రపతి, బాహుబలి, బాహుబలి 2 థియేటర్లలోనే చూశానని చెప్పారు. అలాగే ప్రభాస్ నటించిన మిర్చి, రాధేశ్యామ్ వంటి చిత్రాలకు డబ్బింగ్ చెప్పానని గుర్తు చేశారు.
ప్రభాస్ ఈశ్వర్ సినిమా ట్రైలర్ చూసినప్పుడే ప్రభాస్ పెద్ద హీరో అవుతాడని తన బ్రదర్‌తో చెప్పానని రాశి వివరించారు. అయితే దురదృష్టం కొద్దీ ప్రభాస్‌ను ఇంతవరకు కలవలేకపోయానని.. దాంతో ఆ కోరిక అలాగే ఉండిపోయిందని ఓపెన అయ్యారు. అడవి రాముడు సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ ఉన్న హోటల్‌లోనే తాను కూడా ఉన్నానని అన్నారు. ఆ విషయం తెలిసి ఎగిరి గంతేశానని.. కానీ ప్రభాస్‌ను కలవాలని అనుకున్నా కుదరలేదన్నారు.

ఇక గ్లోబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. రీసెంట్ గానే సంక్రాంతి కానుకగా "రాజాసాబ్" చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అలానే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటిస్తున్న మూవీ 'స్పిరిట్'. పాన్ వరల్డ్ టార్గెట్ గా రాబోతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు, ఇంగ్లీష్, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో రూపొందించనున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో యానిమల్ ఫేమ్ " త్రిప్తి డిమ్రి " హీరోయిన్ గా నటిస్తుంది. అలానే వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. బాలీవుడ్ నటి కాజోల్ కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం. కాగా తన ఫిల్మ్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ ప్రభాస్ పోలీస్ పాత్రలో నటించనున్నారు.
నేను #Prabhas కి మాత్రం అమ్మ గా చేయను#Raasi pic.twitter.com/aCZ2NV3vMF
— 𓆡 ꔪaͥ§Ξ⧉ᨰׁׅ🌔₮ (@biasedbanti) March 25, 2026
-
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
సవాల్ చేసి మరీ అవార్డు కొట్టాడయ్యా..! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17 లిప్ లాక్స్.. ఫస్ట్ మూవీ లోనే ! -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!












Click it and Unblock the Notifications