తండ్రికి ఐదు, కూతురుకి మూడు పెళ్లిళ్లు..స్టార్ హీరోయిన్ సంచలనం

సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. అయితే సౌత్‌లో కూడా వారికి ఏమాత్రం తీసిపోని విధంగా పెళ్లి చేసుకుంది ఓ హీరోయిన్.ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు.. రాధిక.

రాధిక ఇప్పటి ప్రేక్షకులకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మాత్రమే తెలుసు. కానీ కెరీర్ తొలిదశలో ఆమె హీరోయిన్‌గా నటించారు. కృష్ణ, నాగేశ్వరరావు, శోభన్ బాబు, చిరంజీవి వంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా చిరంజీవితో అత్యధిక సినిమాల్లో నటించి హిట్ పెయిర్‌గా నిలిచారామె. గతంలో రాధికకు హీరోలతో సమానంగా అభిమానులుండేవారు. హీరో ఎవరైన సరే రాధిక సినిమాలో ఉందంటే చాలు అభిమానులు ధియేటర్లకు క్యూ కట్టేవారు. ఆ రేంజ్‌లో రాధిక అభిమానులను సంపాదించుకున్నారు.

actress radhika father getting 5 marriages

ఆ తర్వాత కొత్తతరం హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో రాధిక క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. హీరో, హీరోయిన్లకు తల్లి పాత్రలో కనిపిస్తున్నారామె. ఇదే సమయంలో నిర్మాతగా మారి పలు సీరియల్స్‌లో సైతం ఆమె యాక్ట్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే రాధిక వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాధిక పేరు తండ్రి ఎంఆర్ రాధ. ఆయనకు తమిళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. ఎంఆర్ రాధ నాటకరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. అయితే ఆయన ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 5 పెళ్లిళ్లు చేసుకుని సంచలనం సృష్టించారు.

నాటకాలు వేసే సమయంలో అన్ని ప్రాంతాలకు వెళ్లేవారాయన. ఆ సమయంలో పలువురితో ప్రేమలో పడటం, వారిని వివాహం చేసుకోవడం జరిగింది. చివరగా గీత అనే శ్రీలంక మహిళను పెళ్లి చేసుకున్నారాయన. వీరికి పుట్టిన సంతానమే రాధిక. రాధికకు ఓ చెల్లెలు కూడా ఉంది.పేరు నిరోష.... ఆమె కూడా సినిమాల్లో నటించి పాపులర్ అయింది. రాధిక తండ్రికి మొత్తం 12 మంది పిల్లలున్నారు.

అదే విధంగా.. రాధికకు కూడా మూడు పెళ్లిళ్లు అయ్యాయి. 1985లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్, నటుడు ప్రతాప్ పోతెన్‌ను వివాహం చేసుకున్నారామె. చేసుకుంది. అయితే పెళ్లి అయిన కొద్ది రోజులకే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రిచర్డ్ హార్డిని రాధిక పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు.పెళ్లైన రెండేళ్లకే విడాకులు తీసుకున్న రాధిక.. 9 ఏళ్ల పాటు ఒంటరి జీవితాన్ని గడిపారు. ఇక 2001లో అప్పటి స్టార్ హీరో.. శరత్ కుమార్‌ను మూడో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంట హ్యాపీ లైఫ్‌ను లీడ్ చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+