అబ్బాయిలకూ పీరియడ్స్ వస్తే మా నొప్పి తెలుస్తోంది..!

నేషనల్ క్రష్‌ "రష్మిక మందన్నా".. స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస హిట్స్‌తో దూసుకుపోతుంది. తనదైన శైలిలో విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. తెలుగులో నాగశౌర్యతో చేసిన 'ఛలో' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది ఈ కన్నడ బ్యూటీ. ఆ తర్వాత గీత గోవిందం, భీష్మ, సరిలేరు నీకెవ్వరు వంటి విజయవంతమైన చిత్రాలతో తన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత అల్లు అర్జున్ సరసన నటించిన 'పుష్ప' చిత్రం ఆమెకు దేశవ్యాప్తంగా క్రేజ్‌ తెచ్చిపెట్టింది. అలానే రణబీర్ కపూర్ సరసన నటించిన 'యానిమల్', విక్కీ కౌశల్ తో చేసిన 'ఛావా' చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సాధించింది.

actress-rashmika-mandanna-comments-on-periods-to-men-goes-viral-on-media

అలానే సల్మాన్ ఖాన్ తో చేసిన 'సికందర్' ప్రేక్షకులను నిరాశ పరిచింది. రీసెంట్ గానే ఆమె నటించిన 'కుబేరా', 'థామా' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. మొత్తానికి భాషతో సంబంధం లేకుండా నెలకి ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

మరోవైపు రష్మిక 'మైసా' అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రం, విజయ్ దేవరకొండతో కలిసి రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నారు. అలానే పలు ప్రాజెక్ట్‌లకు సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం. ఇక ఇప్పుడు రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీతో అలరించేందుకు రెడీ అయ్యింది. దీక్షిత్ శెట్టి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని.. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. గీతా ఆర్ట్స్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించనుందని చెబుతున్నారు. కాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా రష్మిక పలు షోలు, ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.

ఈ క్రమంలో జగపతిబాబు హోస్ట్ చేస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' టాక్ షోలో పాల్గొని తన బాల్య జ్ఞాపకాలను పంచుకున్నారు. అంతే కాకుండా పీరియడ్స్ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. రష్మిక మాట్లాడుతూ.. మగవాళ్లకు పీరియడ్స్ వస్తే బాగుండేదని.. అప్పుడు వారికి మహిళలు అనుభవించే నొప్పి, బాధ, అసౌకర్యం ఏంటో అర్థమయ్యేదని చెప్పుకొచ్చారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+