గ్లామర్ గేట్లు ఎత్తేసిన బాక్సింగ్ బ్యూటీ "రితికా సింగ్" ..!
విక్టరీ వెంకటేష్ సరసన 'గురు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నటి " రితికా సింగ్ ". నిజ జీవితంలో బాక్సింగ్ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. 'ఇరుదుసుట్రు' అనే తమిళ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రాన్ని హిందీలో 'సాలా ఖడూస్'తో రిలీజ్ చేశారు. ఆ మూవీకి గాను ఉత్తమ పరిచయ నటిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం గెలుచుకుంది. ఆ తర్వాత శివ లింగ, ఓ మై కడవలే వంటి సినిమాలతో ప్రేక్షకులకు మరింత చేరువైన ఈ భామ ఇటీవలే ఇన్ కార్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.
అలానే గత ఏడాది వచ్చిన 'వెట్టయాన్' అనే చిత్రంలో పోలీసాఫీసర్‌గా నటించింది రితికా సింగ్. సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా వచ్చిన ఆ మూవీలో భారీ తారాగణం ఉండడంతో ఆమెకు తగినంత గుర్తింపు లభించలేదనే చెప్పాలి. ప్రస్తుతం ఆమె అరవింద్ స్వామికి జోడీగా 'వనంగమూడి' అనే సినిమాలో నటిస్తుంది. అయితే వరుసగా ప్లాపులు వస్తుండడంతో సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ.

సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉండే రితికా సింగ్ తన లేటెస్ట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తుంది. ఇప్పటివరకు సాఫ్ట్ లుక్‌తో కనిపించిన ఈ భామ.. ఇప్పుడు గ్లామర్ పాత్రలకూ కూడా సిద్ధమని సిగ్నల్ ఇస్తుంది. బోల్డ్ ఫోటోషూట్లతో ఎప్పటికప్పుడు హాట్ పిక్స్ షేర్ చేస్తూ, ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
గ్లామర్ డోర్లు తెరచి మునుపెన్నుడూ లేనంతంగా ఎక్స్ పోజింగ్ చేస్తూ హీట్ పుట్టిస్తోంది. దాంతో అమ్మడికి ఫాలోవర్స్ గట్టిగానే పెరుగుతున్నారు. లేటెస్ట్ గా హాట్ ఫోజులతో మతిపోగొడుతూ ఈమె ఇచ్చిన స్టిల్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరీ ఈ ఫోటో షూట్స్ చూసైన ఆమెకు అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.












Click it and Unblock the Notifications