తమిళ సాంగ్‌లో ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో అదరగొట్టిన రోజా! (వీడియో)

సూపర్ హిట్ మూవీ 'జమా' సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు, దర్శకుడు పారి ఇళవళగన్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో 'అన్బే డయానా' అనే సినిమా ప్రస్తుతం తెరకెక్కుతోంది. తాజాగా సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్ 'పెరంబూర్ గానా విడుదలైంది. అయితే ఈ చిత్రంలో నటి రోజా కూడా నటిస్తున్నారు. తాజాగా విడుదలైన పాటలో రోజా ఎంతో ఉత్సాహంగా స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో ఆమె హీరోకు తల్లిగా నటిస్తున్నట్లు తెలిసింది. మిలియన్ డాలర్ స్టూడియోస్, నియో కాజిల్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

ఎనర్జిటిక్ గానా నంబర్!
ఈ పాట విడుదల సందర్భంగా నటుడు, దర్శకుడు పారి ఇళవళగన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. "పెరంబూర్ గానా ఇప్పుడు మీ ముందుకు వచ్చింది. పక్కా లోకల్ ఏరియా గ్యాంగ్ వైబ్స్, రా ఎనర్జీ, ఫుల్ ఫన్‌తో కూడిన ఎలక్ట్రిఫైయింగ్ ట్రాక్ ఇది" అని పేర్కొన్నారు. ఈ పాటలో పారి ఇళవళగన్, రమ్య రంగనాథన్, రోజా సెల్వమణి, చేతన్ కె.ఎ, గోపి అరవింద్ కనిపిస్తున్నారు. భరత్ శంకర్ ఈ ఎనర్జిటిక్ పాటకు సంగీతాన్ని అందించారు. ప్రముఖ గాయకుడు జెస్సీ గిఫ్ట్ తనదైన శైలిలో ఈ గానా పాటను ఆలపించారు.

Actress Roja Energetic Dance in Perambur Gaana Song from Tamil Movie Anbe Diana Goes Viral

కథానాయికగా రమ్య
ధనుష్ దర్శకత్వం వహించిన 'నిలవుక్కు ఎన్మెల్ ఎన్నడి కోబమ్' చిత్రంతో గుర్తింపు పొందిన రమ్య రంగనాథన్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే సినిమాపై అంచనాలను పెంచింది. ఇందులో పారి ఇళవళగన్ పెళ్లికొడుకు దుస్తుల్లో, రక్తం మరకల చొక్కాతో కోపంగా కనిపిస్తుండగా.. పక్కనే రమ్య రంగనాథన్ పెళ్లికూతురు గెటప్‌లో ఉండటం అందరినీ ఆకట్టుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+