రాత్రి రూమ్‌కి వస్తావా అని అడుగుతున్నారు.. మహేష్ బాబు హీరోయిన్ సంచలనం
ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు. తాజాగా ఓ తెలుగు హీరోయిన్ తనకు ఎదురైన లైంగిక వేధింపులకు గురించి వివరించారు.
సనం శెట్టి అనే హీరోయిన్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న అనుభవాలను తాజాగా ఈ అమ్మడు బయటపెట్టింది.సనం శెట్టి మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టింది. ఆమె మిస్ సౌత్ ఇండియా 2016 అందాల పోటీలో విజేతగా నిలిచారు. సనం శెట్టి తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.ఆమె ప్రధానంగా తమిళం, తెలుగు , మలయాళ చిత్రాలలో నటించారు.ఆమె 1983 నవంబర్ 12న జన్మించారు. 2020లో, ఆమె బిగ్ బాస్ 4 తమిళ రియాలిటీ సిరీస్‌లో పోటీదారుగా ఉన్నారు.

ఆమె "అంబులి" (2012), "కథం కథం" (2015) వంటి చిత్రాలలో నటించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన "శ్రీమంతుడు" సినిమాలో సనం శెట్టి చిన్న పాత్రలో నటించారు. తాజాగా ఈ భామ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో లింగ వివక్ష విపరీతంగా ఉందన్నారు. హీరోయిన్‌లకు ఒక పారితోషికం, హీరోలకు మరో విధంగా పారితోషికం ఉందన్నారు. సమానత్వం అనేది కేవలం మాటల్లో ఉందని, దాన్ని ఎవరు పాటించడంలేదని ఆమె మండిపడ్డారు.
#BADGIRL Teaser is NOT a BOLD Example.. ❌
— Sanam Shetty (@ungalsanam) February 18, 2025
It's a #BAD Example! 👎#Freedom of choice and #GenderEquality concepts are wrongly portrayed in case of #Minors here! #Legally, #Ethically and even #Medically it sends a terribly #wrong message to the already influencable adolescent… pic.twitter.com/Dv6pVdXxtG
సాధారణంగా నిర్మాతలు ముఖ్యంగా కాల్స్ చేసి పిలుస్తారు. అయితే.. వారేదో సినిమాలో చాన్స్ ఇస్తున్నారని వెళ్తే.. తమతో మొదట గడపాలని.. పడక పంచుకుంటే.. అవకాశం అన్నట్లు వ్యవహరిస్తున్నారని నటి సనమ్ శెట్టి ఆవేదన వ్యక్తం చేసింది.కొంత మంది నిర్మాతలకు సినిమాల్లో అవకాశాల కోసం సంప్రదిస్తే..తమతో బెడ్ షేర్ చేసుకొవాలని వేధిస్తున్నారని బాంబు పేల్చింది.ప్రస్తుతం అమ్మడు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications