Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అందాన్ని ఎరగా వేసి 4 హత్యలు చేసిన స్టార్ హీరోయిన్..12 ఏళ్లుగా జైల్లోనే

హీరోలు, విలన్లు సినిమాల్లో హత్యలు చేయడం మనం సాధారణంగానే చూస్తునే ఉంటాం. అయితే ఓ హీరోయిన్ మాత్రం నిజ జీవితంలో ఏకంగా 4 హత్యలు చేసి , ఏకంగా 12 ఏళ్లు జైలు జీవితం గడిపింది. క్రైమ్ స్టోరీకి ఏమాత్రం తీసిపోని విధంగా ఆ హీరోయిన్ 4 హత్యలు చేసింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు..సిమ్రాన్. ఈ భామ అసలు పేరు సీమా సురేంద్రనాథ్ దూసంజ్. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు కానీ, బాలీవుడ్ జనాలకు ఈ పేరు సుపరిచితమే. నటి కావాలని కలలు కన్న సిమ్రాన్‌కు కుటుంబ సభ్యులు అడ్డుగా నిలిచారు.

దీంతో సిమ్రాన్ 1995లో ఇల్లు వదిలి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అక్కడ ఓ వ్యక్తితో పరిచియం ఏర్పడింది. ఆ పరిచియం ప్రేమగా మారడంతో ఇద్దరు కలిసి డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత బాలీవుడ్ పార్టీలు, క్రికెట్ పార్టీల్లో కనిపించడం మొదలుపెట్టింది.దాంతో వీరిద్దరు కలిసి బాగా డబ్బున్న వాళ్లను పట్టి వాళ్లను టార్గెట్ చేసి ట్రాప్ చేసేవారు. అందులోనూ ఈ బ్యూటీ తన అందచందాలను ఒలకబోస్తూ డబ్బున్న వాళ్లను ఆకర్షించడం మొదలుపెట్టింది. అలా వాళ్లను లోబర్చుకుని..వీరిద్దరు కలిసి వీలైనన్నీ డబ్బులు నొక్కేసి.. ఆ తర్వాత హత్యలు చేసేవారు.

actress Seema Surendranath Dosanjh has been in jail for 12 years after committing 4 murders

అలా వచ్చిన డబ్బులతో సినిమాల్లో అవకాశాల కోసం ట్రే చేసేది. ప్రియుడు విదేశాలకు వెళ్లడంతో , ఒక్కటే సినిమాల్లో ప్రయత్నాలు చేసుకుంది. అలా 'అనోఖ అనుభవం' అనే సినిమాతో తొలి సారి స్క్రీన్ పై కనిపించింది.ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించింది. అలా కొంత కాలం పాటు సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. మళ్లీ తన ప్రియుడు తిరిగి ఇండియాకు రావడంతో.. ఇద్దరు కలిసి ధనవంతులను మోసం చేయడం మొదలుపెట్టారు.అలా ఈ జంట 4 హత్యలు చేశారు. ఎట్టకేలకు ఓ హత్య కేసులో పోలీసులకు చిక్కి జైలు పాలయ్యారు. గత 12 ఏళ్లు వీరిద్దరు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+