వివాహేతర సంబంధం తప్పు కాదు..నటి సంచలన కామెంట్స్
దాంపత్య జీవితం లో అసంతృప్తి ఉంటే ఆ దంపతులను వివాహేతర సంబంధాల వైపు నడిపిస్తుంది. వివాహం తర్వాత సంతృప్తికరమైన అనుబంధం లేకపోవడం, ఆకర్షణ తగ్గిపోవడం వంటి కారణాలతో వ్యక్తులు కొత్త సంబంధాల కోసం వెతుకుతారు. దాంపత్య జీవితం పట్ల నిరాసక్తత, విసుగు వున్నప్పుడు వివాహేతర సంబంధాల పట్ల ఆకర్షితులను చేస్తుంది. ప్రస్తుతం ఈ వివాహేతర సంబంధాలు చాలా సులభంగా పెరిగిపోతున్నాయి.
పాశ్చాత్య సంస్కృతి ప్రభావం కూడా ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. దంపతులు వైవాహిక జీవితానికి సరైన గౌరవం ఇవ్వకపోవడం, సంస్కృతిని పక్కనపెట్టడం కూడా ఇందుకు కారణమౌతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ నటి వివాహేతర సంబంధం తప్పు కాదని చెప్పి ఓ నటి సంచలనం సృష్టించింది. ఇలా చెప్పింది మరెవ్వరో కాదు..ప్రముఖ మాలీవుడ్ నటి షీలూ అబ్రహం.

తాజాగా ఈ భామ వివాహేతర సంబంధం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. వివాహేతర సంబంధాలకు పాల్పడే వారిని ఎప్పుడూ నిందించకూడదని చెప్పుకొచ్చింది. వైవాహిక జీవితంలో తెలిసో తెలియకో కొన్ని పొరపాట్ల వల్ల ఎఫైర్స్ మొదలవుతాయని అంత మాత్రాన అలాంటి బంధాన్ని తప్పని చెప్పలేమని షీలూ అబ్రహం షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఇవన్నీ వారి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయాలు, ఇలాంటివి సోషల్ మీడియాలో చర్చకు రాకూడదని హితబోధ చేస్తోంది. అత్యాచారం తప్పు కానీ ఏకాభిప్రాయంతో జరిగే రొమాన్స్ తప్పు కాదంటూ ఈ హాట్ బ్యూటీ క్లాస్ పీకుతోంది. ఇష్ట ప్రకారం శారీరకంగా ఒక్కటై.. దాన్ని రేప్ అని క్లెయిమ్ చేయడం సరికాదు. అలాగే సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ గురించి ప్రజలకు నేరుగా తెలియకపోయినా.. పుకార్లు.. కొన్ని వార్తల ద్వారా తెలుస్తున్నాయనే అభిప్రాయాం వ్యక్తం చేసింది.
ఈ రోజుల్లో స్త్రీ పురుషుల మధ్య ఎఫైర్స్ సర్వసాధారణం. వీరి మధ్య విబేధాలు ఏర్పడినప్పుడు అది అసూయ, ద్వేషం ఏర్పడి ఇలాంటి కేసులకు దారితీస్తుంది. అయితే ఇలాంటి విషయాల్లో మహిళలు జాగ్రత్తగా ఉండాలని నేను చెప్పదలుచుకున్నానంటూ వెల్లడించింది. వివాహేతర సంబంధాల గురించి షీలూ అబ్రహం చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications