అలా ఉంటేనే హీరోయిన్ ఛాన్స్ - శివాత్మిక రాజశేఖర్
తెలుగు సినీ పరిశ్రమలో రాజశేఖర్ - జీవిత దంపతుల గురించి పరిచయం అక్కర్లేదు. యాంగ్రీ మెన్ గా, ఫ్యామిలీ హీరోగా ఎన్నో హిట్లు తన ఖాతాలో వేసుకున్నారు రాజశేఖర్. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ సినీ రంగంలో అడుగుపెట్టారు వారి ఇద్దరు కుమార్తెలు - శివానీ, శివాత్మిక. నటనపై ఆసక్తితో పాటు, మరోవైపు స్టడీస్ ను సైతం కొనసాగిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు ఈ సిస్టర్స్.
కాగా 2019లో విడుదలైన దొరసాని చిత్రంతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది " శివాత్మిక ". తన తొలి సినిమాలోనే మంచి అభినయం చూపించి, సైమా ఉత్తమ నూతన నటి అవార్డును గెలుచుకుంది. ఈ సినిమా కమర్షియల్‌గా పెద్ద హిట్ కాకపోయినా.. శివాత్మిక నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత తెలుగులో పంచతంత్రం, రంగమార్తాండ వంటి సినిమాల్లో నటించింది.

అలాగే తమిళ చిత్రాలు ఆనందం విలయదుం వీడు, నితమ్ ఒక్ వానం వంటి సినిమాల్లో నటిస్తూ కోలీవుడ్ లోనూ రాణిస్తుంది ఈ ముద్దుగుమ్మ. సినిమాల్లో గ్లామర్ షో కి ప్రాధాన్యం ఇవ్వకుండా.. నటనకు అవకాశమిచ్చే కథలను ఎంపిక చేసుకుంటూ దూసుకుపోతుంది. అయితే తెలుగులో 2023లో వచ్చిన రంగమార్తాండ సినిమా తర్వాత శివాత్మిక నుంచి కొత్త ప్రాజెక్టులు ఏవి రిలీజ్ కాలేదు.
అందుకే తీసేశారు..
ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాత్మిక ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. సినీ పరిశ్రమలో టాలెంట్ కంటే సోషల్ మీడియా ఫాలోవర్స్ ఎక్కువగా చూసే పరిస్థితి ఉందని షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ తక్కువగా ఉండటంతో కొన్ని సినిమాల నుంచి తీసేసారని వెల్లడించింది. తన స్థానంలో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వారిని తీసుకున్నారని చెప్పింది. మేనేజర్లు, ఏజెంట్లు కూడా ఫాలోవర్స్ పెంచుకోమని ఒత్తిడి తెస్తారని పేర్కొంది. తాను యాక్టర్‌ని అని.. కంటెంట్ క్రియేటర్‌ను కాదని స్పష్టం చేసింది. తనను నటనతో గుర్తించాలి కానీ సోషల్ మీడియా నంబర్స్ తో కాదని వ్యాఖ్యానించింది శివాత్మిక.
మరోవైపు శివాత్మిక తన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ను ఉపయోగించుకోకుండా ఎదగాలి అనుకోవడం పట్ల ప్రశంసలు వస్తున్నాయి. నటనతో పాటు విద్యను సమపాళ్లలో కొనసాగిస్తూ ఉండడం పట్ల మంచి కామెంట్స్ వస్తున్నాయి. ఇక రాజశేఖర్ మరో కుమార్తె శివానీ రాజశేఖర్ 2021లో అద్భుతం సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. తెలుగుతో పాటు తమిళంలోనూ కొన్ని సినిమాల్లో నటిస్తూ, ఆమె కూడా తనదైన గుర్తింపు కోసం శ్రమిస్తోంది.












Click it and Unblock the Notifications