లవర్‌తో సీక్రెట్‌గా పెళ్లి చేసేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..?

తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది కన్నడ నటి శోభా శెట్టి. 'అగ్నిసాక్షి' సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. 'కార్తీక దీపం' సీరియల్‌లో మోనిత పాత్రతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఆమె విలనిజం, ఎమోషన్‌, నటన అన్నీ కలిపి ఆ పాత్రను మరిచిపోలేని స్థాయికి చేర్చాయి. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో పాల్గొని మరింత ఫేమ్‌ సంపాదించింది. అలానే కన్నడ బిగ్ బాస్ సీజన్ 11లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పాల్గొంది. రెండు రియాలిటీ షోల్లో విజేతగా నిలవకపోయినా క్రేజ్ మాత్రం సంపాదించుకుంది.

నటుడు యశ్వంత్ రెడ్డితో ప్రేమ..

కాగా 'కార్తీక దీపం' సీరియల్ షూటింగ్ సమయంలో శోభా శెట్టి, నటుడు యశ్వంత్ రెడ్డి మధ్య ప్రేమ మొదలైంది. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు శోభా తన ప్రేమ విషయాన్ని బహిరంగంగా వెల్లడించింది. ఆ తర్వాత 2024 ఏప్రిల్‌లో ఇద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. అప్పటి నుండి ఈ జంట సోషల్ మీడియాలో "కపుల్"గా మారిపోయారు.

actress-shobha-shetty-and-yashwanth-reddy-marriage-photos-goes-viral

రహస్యంగా పెళ్లి..?

అయితే లేటెస్ట్ గా శోభా శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వెడ్డింగ్ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అందులో శోభా, యశ్వంత్ పెళ్లి దుస్తుల్లో నూతన వధూవరుల్లా మెరిసిపోయారు. తలంబ్రాలు వేస్తూ కనిపించిన దృశ్యాలు చూసి అభిమానులు నిజంగానే పెళ్లి జరిగిందా అని సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు.

అసలు నిజం..?

ఇక ఆ వీడియోల వెనుక ఉన్న నిజం బయటపడింది. శోభా, యశ్వంత్ నిజంగా పెళ్లి చేసుకోలేదని.. వారు 'జోయాస్ జ్యువెలరీ' (Joyas Jewellery) బ్రాండ్‌కు సంబంధించిన ప్రమోషనల్ యాడ్ షూట్‌లో భాగంగా పెళ్లి దుస్తులు ధరించి నటించారని తెలుస్తోంది. ఈ యాడ్ కోసం ప్రత్యేకంగా వెడ్డింగ్ సెట్‌ కూడా నిర్మించారని అంటున్నారు. ఈ వీడియోలు, ఫొటోలు బయటకు వచ్చిన వెంటనే అభిమానులు పొరపాటున రియల్ వెడ్డింగ్ అని భావించామని.. "నిజమైన పెళ్లి ఎప్పుడు?" అని కామెంట్లు పెడుతున్నారు.

మరోవైపు శోభా కేవలం నటిగా కాకుండా, వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టింది. ఆమె స్వంతంగా ప్రారంభించిన "శోభా శెట్టి డిజైనర్ స్టూడియోస్" ద్వారా ఫ్యాషన్, జ్యువెలరీ డిజైనింగ్‌లో తన ప్రతిభను చూపుతోంది. అదనంగా పలు టీవీ షోస్, రియాలిటీ ప్రోగ్రామ్‌లలో పాల్గొంటూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె కొత్త ప్రాజెక్టులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లతో బిజీగా ఉండటంతో పెళ్లి తేదీని రహస్యంగా ఉంచినట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+