ఐశ్వర్యరాయ్‌తో అభిషేక్ బచ్చన్ విడాకులపై సంచలన పోస్ట్

గత కొద్దిరోజులుగా ఐశ్వర్యరాయ్ వ్యక్తిగత జీవితం గురించి అనేక కథనాలు వెలువడుతున్నాయి. ఐశ్వర్యరాయ్ తన భర్త,బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌తో విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. 2007లో ఐశ్వర్యరాయ్,అభిషేక్ బచ్చన్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది. 16 ఏళ్లు బాగానే సాగిన కాపురంలో గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్న సంగతి అందరికి తెలిసిందే.

తాము కలిసే ఉన్నామని విడాకులు తీసుకోవడం లేదని ఐశ్వర్యరాయ్ క్లారిటీ ఇస్తూ ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసినప్పటికి ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు. ఐశ్వర్యరాయ్ కూతురుతో కలిసి ఒంటిరిగా విదేశాలకు వెళ్లడం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చినట్టు అయింది. ముంబై విమానాశ్రయంలో ఐశ్యర్య, ఆరాధ్య మాత్రమే కనిపించడం, అభిషేక్ బచ్చన్ లేకపోవడం మరోసారి ఈ జంట విడాకులు గురించి చర్చకు వచ్చింది. ఇదే సమయంలో ఐశ్వర్యరాయ్ ఓ వ్యక్తితో క్లోజ్‌గా మూవ్ అవుతోందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

Actress Simi Garewal sensational post on Abhishek Bachchan s divorce with Aishwarya Rai

ఐశ్వర్యరాయ్‌ జిరాక్ మార్కర్ అనే ఓ డాక్టర్‌తో సన్నిహితంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ స్నేహం ప్రస్తుతం వేరే రిలేషన్‌గా మారిందని కొంతమంది బాలీవుడ్ జనాలు చర్చించుకున్నారు. అయితే అతను ఐశ్వర్యరాయ్ చిన్ననాటి స్నేహితుడని ఆమె సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ హీరోయిన్ కారణంగా ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్‌ వైవాహిక జీవితంలో విభేదాలు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది.అభిషేక్ బచ్చన్‌ లైఫ్‌లోకి మరో మహిళ రావడం వల్లే వీరి మధ్య గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. దస్వి సినిమాలో నటి నిమ్రత్ కౌర్‌తో అభిషేక్ బచ్చన్‌ క్లోజ్‌గా మూవ్ అవుతున్నాడని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

వీరిద్దరూ రిలేషన్‌షిప్ పెట్టుకున్నారని తెలిసి ఐశ్వర్య గొడవ పెట్టుకుందని అంటున్నారు. ఆ తర్వాత వీరి వైవాహిక బంధంలో సమస్యలు మరింత తీవ్రమయ్యాయనే ప్రచారం జరుగుతోంది.సరిగ్గా ఇదే సమయంలో ఐశ్వర్యరాయ్ పుట్టిన రోజు నాడు అభిషేక్ ఆమెకు విషెష్ కూడా చెప్పలేదు. దీంతో వీరిద్దరి విడాకుల వార్తలకు బలం చేకూరినట్లు అయింది. ఈ విషయంలో నెటిజన్లు అభిషేక్‌ను తప్పు పడుతూ భార్యకు విష్ చేయకపోవడమేంటని మండిపడుతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, నటి సిమి గరేవాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిషేక్ తరపున మాట్లాడుతూ ఓ సంచలన పోస్ట్ షేర్ చేసింది. అభిషేక్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఆయన బాలీవుడ్‌లో మంచి వ్యక్తులలో ఒకడని అంగీకరిస్తారు. నేను కూడా అతను చాలా మంచి వ్యక్తి అని భావిస్తున్నాను. అభిషేక్‌కు మంచి విలువలు, మర్యాద గురించి బాగా తెలుసంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. అయితే ఈ నటి . ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్‌ విడాకుల వార్తలపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+