ఏడాదిలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్

సెలబ్రిటీలందరూ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. కెరీర్‌తో పాటు తమ వైవాహిక జీవితానికి కూడా సినీ సెలబ్రిటీలు ప్రాధాన్యతను ఇస్తున్నట్టు కనిపిస్తున్నారు. గతంలో పెళ్లి చేసుకుంటే వారి కెరీర్ అక్కడితో ముగిసిపోయేది. కానీ నటీనటుల మైండ్ సెట్ మారుతుంది. పెళ్లి తర్వాత కూడా తమ కెరీర్‌ను కొనసాగించేలా ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రేక్షకుల అభిరుచి కూడా మారింది. పెళ్లైన హీరోయిన్లను సైతం వారు ప్రోత్సహిస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ ఒకే ఏడాదిలో రెండు పెళ్లిళ్లు చేసుకుని చరిత్ర సృష్టిచింది.

తప్పుగా అర్థం చేసుకోకండి. రెండుసార్లు కూడా ఒకే అతన్ని ఆమె వివాహం చేసుకున్నారు. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు..శ్రీజిత. శ్రీజిత గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ, బాలీవుడ్ జానాలకు ఈ ముద్దుగుమ్మ సుపరిచితమే. కసౌతి జిందగీ కే సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. కరణ్ అప్నా అప్నా, టషాన్, లవ్ కా ది ఎండ్, మాన్ సూన్ సూట్ అవుట్, రిస్క్ లాంటి సినిమాలలో నటించి మెప్పించింది. కెరీర్ పీక్ టైంలోనే అమ్మడు ప్రేమలో పడింది.

Actress Sreejita married her husband for the second time in the same year

మైఖేల్ బ్లోమ్-పేప్‌ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.పెళ్లైన దగ్గర నుంచి ఫొటోలు వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తు ఉంది. తాజాగా ఈ భామ తన భర్తను రెండోసారి వివాహం చేసుకుంది. మొదటిసారి ఈ జంట క్రిస్టియన్ పద్ధతిలో వివాహం జరిపించుకున్నారు. రెండో వివాహం గోవాలో సాంప్రదాయ బెంగాలీ వేడుకలో మరోసారి పెళ్లి పీటలెక్కారు. ఇలా ఒకే ఏడాది తన భర్తను రెండోసారి పెళ్లి చేసుకుని అభిమానులను ఆశ్చర్య పరిచింది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+