చిరంజీవితో సినిమానా..నిర్మొహమాటంగా నో చెప్పిన శ్రీలీల..?
మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే ఏ ఆర్టిస్ట్ అయిన సరే ఎగిరి గంతేస్తారు. చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని చాలామంది ఇండస్ట్రీకి వచ్చారు. రవితేజ లాంటి స్టార్ హీరో కూడా చిరంజీవిని చూసే తాను సినిమాల్లోకి వచ్చినట్టు తెలిపారు. ఇప్పుడున్న స్టార్ హీరోలంతా కూడా చిరంజీవి అంటే ఎంతో గౌరవిస్తుంటారు. అలాంటిది చిరంజీవి సినిమాలో చిన్న రోల్ వచ్చిన చాలు అనుకునే వాళ్లు చాలామంది ఉన్నారు. కానీ చిరంజీవి సినిమాలో ఛాన్స్ వచ్చిన నిరాకరించింది హీరోయిన్ శ్రీలీల.చిరంజీవి సినిమాలో ఆఫర్ వచ్చినప్పటికి , ఆ ఆఫర్‌కు నో చెప్పిందట శ్రీలీల.
చిరంజీవి ప్రస్తుతం మల్లిడి వసిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో వి. వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి మరియు విక్రమ్ రెడ్డి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. చిత్రీకరణ దశలో ఉన్న విశ్వంభర 2025 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీలను సంప్రదించారట చిత్ర యూనిట్.

అయితే శ్రీలీల ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిందని తెలుస్తోంది. ఇప్పట్లో ఐటెమ్ సాంగులు చేసే ఉద్దేశం తనకు లేదని చెప్పి చిరంజీవి సినిమా నుంచి తప్పుకుందట ఈ భామ. అయితే చిరంజీవి సినిమాలో ఆఫర్ వస్తే చేతులారా వదులుకుందని కొంతమంది ఆమెపై పెదవి విరుస్తుండగా, మరికొన్ని చిత్రాల్లో కూడా ఐటం సాంగ్ చేసే ఆఫర్లు రాగా.. వాటిని సైతం శ్రీలీల రిజెక్ట్ చేసిందని తెలుస్తోంది. అయితే అలాంటప్పుడు అల్లు అర్జున్ నటించిన 'పుష్ప-2' సినిమాలో ఐటమ్ సాంగ్ ఎలా చేశావని మెగా అభిమానులు శ్రీలీలను ప్రశ్నిస్తున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'గోట్' సినిమాలో కూడా ఓ సాంగ్ కోసం శ్రీలీలను చిత్ర యూనిట్ సంప్రదించారు. దాన్ని కూడా శ్రీలీల రిజెక్ట్ చేసింది. స్టార్ హీరోయిన్ త్రిషతో ఈ సాంగ్ చేయించారు.
ఇక పుష్ప-2 సినిమాలో 'కిస్సక్' సాంగ్‌గానూ శ్రీలీల రూ.2 కోట్ల రూపాయిల వరకు పారితోషకం తీసుకుందనే వార్తలు వినిపించాయి. శ్రీలీల డాన్స్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెపక్కర్లేదు. ఒకరకంగా డాన్సుల వల్లే ఆమె ఎక్కువ పాపులరిటీని సంపాదించుకుంది. మొన్నటి వరకు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన శ్రీలీల, ప్రస్తుతం తమిళ, హిందీ సినిమాలతో ఫుల్ బిజీగా మారింది.












Click it and Unblock the Notifications