పెళ్లికి ముందే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన శ్రీలీల.. నెటిజన్లు కామెంట్ల వర్షం
డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల ప్రస్తుతం చేతినిండా సినిమాలతో దూసుకెళ్తోంది. పెళ్లి సందడి సినిమాతో చిత్రసీమకు పరిచయమై ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఆ తర్వాత అందరూ అగ్రహీరోలతోనూ ఆడిపాడింది ఈ భామ. ఇక ఆమె డ్యాన్స్ కు సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఈ మిల్క్ బ్యూటీని డ్యాన్సింగ్ క్వీన్ అని ముద్దుగా పిలుస్తుంటారు ఫ్యాన్స్.
అటు గుంటూరు కారంలో కుర్చీ మడతపెట్టినా.. ఇటు పుష్ప 2లో దెబ్బలు పడతాయి అన్న అది డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీలకే సాథ్యం. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది శ్రీలీల. కారణం ఆమె ఇద్దరు వికలాంగ పిల్లలను దత్తత తీసుకుంది. 2022లో గురు, శోభిత అనే ఇద్దరు వికలాంగ పిల్లలను శ్రీలీల దత్తత తీసుకుంది. శ్రీ లీల ఒక అనాథాశ్రమాన్ని సందర్శించి, వారి పరిస్థితిని చూసిన తర్వాత పిల్లలను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది. పిల్లల పరిస్థితి చూసి తాను చలించిపోయానని, జీవితాంతం వారిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నానని శ్రీలీల చెప్పింది. అయితే ఇప్పుడు ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతోంది.

శ్రీలీల నిర్ణయం స్ఫూర్తిదాయకమని, కంగ్రాట్స్ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక కెరీర్ విషయానికి వస్తే 2024 ఇయర్ ఎండింగ్‌లో కిస్సిక్ సాంగ్ తో వచ్చి దుమ్మురేపింది శ్రీలీల. అయితే ఈ ఏడాదిలో రీసెంట్ గా వచ్చిన రాబిన్‌హుడ్ నిరాశ పరిచినా పలు సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉంది. తెలుగులో రవితేజతో కలిసి మాస్ జాతర ప్రొమోషన్లలో నిమగ్నమైంది. ఇక రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో అఖిల్ చేస్తున్న లెనిన్‌లోనూ హీరోయిన్‌గా శ్రీలీల కనిపిస్తోంది. తమిళంలో శివకార్తికేయన్ పరాశక్తి సినిమాలో కథానాయికగా నటిస్తుంది. అంతేకాక హిందీలో కార్తిక్ ఆర్యన్ సరసన ఓ సినిమా చేస్తుంది.












Click it and Unblock the Notifications