చిన్నగా ఉందని ఆ పార్ట్‌కు సర్జరీ చేయించుకున్నా : బిగ్‌బాస్ నటి
నటి శ్రీసత్య అంటే తెలియని బుల్లితెర అభిమాని ఉండరు. ష్టార్ట్ ఫిల్మ్స్‌లో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నారామె. ఆ తర్వాత పలు టీవీ షోలకు హోస్ట్‌గా చేస్తూ తన పాపులారిటీని మరింత పెంచుకున్నారామె. సీరియల్స్, వెబ్ సిరీస్‌లో నటిస్తూ తన కెరీర్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. బుల్లితెరపై శ్రీసత్య కంటూ స్పెషల్ క్రేజ్ ఉంది. ఆమె తన అందం, క్యూట్ మాటలతో చాలామంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక బుల్లితెరపై వచ్చిన గుర్తింపుతో రియాల్టీ షో బిగ్‌బాస్‌లో సైతం అడుగుపెట్టింది. తద్వారా తన స్టార్‌డమ్‌ను మరింత పెంచుకుంది. శ్రీసత్య ప్రస్తుతం టీవీ షోలతో చాలా బిజీగా ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా శ్రీసత్య ఓ యూట్యూబ్ ఇంటర్య్వూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. సినిమాల్లో తనకు ఆఫర్లు చేజారిపోతున్నాయని ఆమె ఇంటర్య్వూలో తెలిపింది. సినిమాల్లో కనిపించాలనేది నా కల అని కానీ నేను చేసిన ప్రయత్నాలు సక్సెస్ కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. నేను సీరియళ్లు చేస్తున్నానని కొంతమంది సినిమాలో ఆఫర్లు ఇవ్వడం లేదని శ్రీసత్య ఆరోపించింది. అయితే శ్రీసత్య ఇటీవల పెదవులకు సర్జరీ చేయించుకున్నట్లు పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆమెను యాంకర్ ప్రశ్నించగా, అవును చేయించుకున్నానని సమాధానం ఇచ్చింది. చాన్సుల కోసం ఎక్కడికి వెళ్లినా నా లిప్ చిన్నగా ఉండటం వల్ల చిన్న పిల్లలాగా ఉన్నావని అన్నారు. ఆఫర్లు ఇవ్వట్లేదు అందుకే లిప్‌కు సర్జరీ చేయించాను.

నేను చిన్నపిల్లలా కనిపిస్తున్నానని ఆఫర్లు ఇవ్వడం లేదని అందుకని లిప్ ఫిల్లర్స్ వేయించుకున్నానని ఆమె పేర్కొన్నారు. దీనిపై చండాలంగా ఉన్నావంటూ కొందరు నన్ను ట్రోల్స్ కూడా చేశారని శ్రీసత్య తెలిపింది. అయితే సినిమా వాళ్లు ఇప్పుడు బాగున్నానని అంటున్నారని, కానీ ఇది నాకు నచ్చలేదని ..ఇదిపర్మినెంట్ కాదు. మూడు నెలల తర్వాత సెట్ అవుతుందని ఈ బుల్లితెర బ్యూటీ తెలిపింది.అప్పటి వరకు ట్రోల్స్ భరించక తప్పదు అని చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో పెళ్లి గురించి మాట్లాడుతూ..తాను జీవితంలో పెళ్లి చేసుకోనని..ఫీలింగ్స్ చచ్చిపోయాంటూ సమాధానం ఇచ్చింది. మరి లిప్‌కు సర్జరీ తర్వాత అయిన ఆమెకు సినిమాల్లో అవకాశాలు ఇస్తారేమో చూడాలి.












Click it and Unblock the Notifications