సినిమాలో అవకాశం కోసం 5 మందితో.. భరించలేకపోయా.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి.కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపులు గురించి బహిరంగంగానే చెబుతున్నారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్‌, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు.

కమిట్మెంట్ ఇచ్చినప్పటికీ ఆఫర్స్ రావడం లేదని ఇటీవలే ఓ తెలుగు నటి వెల్లడించారు. తాజాగా మలయాళ నటి సంచలన కామెంట్స్ చేశారు. సినిమాలో అవకాశాల కోసం ఇక్కడ చాలామందితో కమిట్ అవాల్సి ఉంటుందని ఆ నటి తెలిపారు. మలయాళ యంగ్ హీరోయిన్స్‌లో శృతి హరిహరన్ ఒకరు. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ..మలయాళంలో మాత్రం శృతి హరిహరన్ మంచి గుర్తింపు ఉంది. 2012లో విడుదలైన 'సినిమా కంపెనీ'అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'దయోతిరి', 'సావరీ 2', 'లూసియా' వంటి కన్నడ చిత్రాలలో కూడా నటించి మెప్పించింది. అంతేకాదు తమిళంలో 'నిల', 'నెరుంగి వా ముత్త మీదతే' వంటి సినిమాల్లో నటించింది.

actress sruthi hariharan about casting couch

తాజాగా ఈ భామ కమింట్మెంట్‌ గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు నిర్మాతలు తనను ఇబ్బంది పెట్టారని శృతి హరిహరన్ చెప్పుకొచ్చింది. శృతి హరిహరన్ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. నేను నటించిన తొలి కన్నడ సినిమాకి జరిగిన మీటింగ్ నన్ను మరింత భయపెట్టిందని చెప్పుకొచ్చింది. నా వయస్సు అప్పుడు 18 సంవత్సరాలు మాత్రమే. కాస్టింగ్ కౌచ్ షాక్‌తో నేను విపరీతంగా భయపడిపోయాను. ఆ సినిమాకు ఐదుగురు నిర్మాతలు కావడంతో.. ఆ ఐదుగురికి కమిట్మెంట్ ఇవ్వాలని అడిగారు. ఆ సమయంలో నేను ఏం చెప్పాలో తెలియక గట్టిగా అరిచి అక్కడి నుంచి వచ్చేశానని శృతి తెలిపింది. కమిట్మెంట్ ఇవ్వాలదనే ఆ సినిమా నుంచి నన్ను తీసేశారని ఆమె చెప్పుకొచ్చింది. కమిట్మెంట్ గురించి శృతి హరిహరన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+