లిప్ లాక్‌కి ముందు ఆ హీరోను బ్రష్ చేసుకో అని చెప్పా..స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ఒకప్పుడు సినిమాలు కుటుంబ సమేతంగా కూర్చొని చూడదగే విధంగా ఉండేవి. కానీ ఇప్పుడు కాలం మారడంతో సినిమాలు కూడా ట్రెండ్‌కు తగ్గట్టుగా మారుతున్నాయి. నేటి తరం సినిమాల్లో ముద్దు సీన్లతో పాటు, శృంగారభరిత సన్నివేశాలతో నింపేస్తున్నారు. దీంతో థియేటర్లకు వచ్చే ఫ్యామిలీ ఆడియెన్స్ సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. ఒకప్పుడు సినిమాలో ముద్దు సీన్లు ఉంటే వార్త. ఇప్పుడు ఎన్ని ముద్దు సీన్లు ఉంటే అంత పెద్ద వార్త అన్నట్టుగా సినిమా మారిపోయింది.

గతంలో నటులు ముద్దు సీన్లలో నటించడానికి తెగ మొహమాట పడేవారు. కానీ నేటితరం నటులైతే ముద్దు సీన్లు బట్టి తమ పారితోషికం డిమాండ్ చేయడం పరిపాటిగా మారింది. తాజాగా ముద్దు సీన్లకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మలయాళ సూపర్ హిట్ "రైఫిల్‌ క్లబ్‌" సినిమాలో ఓ లిప్ లాక్ సీన్. సినిమా ఎంతటి హిట్ అయినప్పటికీ, ఈ సినిమాలో ఉన్న లిప్ లాక్ సన్నివేశం గురించి సినీ అభిమానులు చర్చించుకున్నారు. ఈ ముద్దు సన్నివేశంలో నటించింది సురభి లక్ష్మి, సజీవ్‌ కుమార్‌.

Actress Surabhi asks the hero to brush his teeth before lip locking

తాజాగా ఈ ముద్దు సన్నివేశం గురించి నటి సురభి లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. సినిమాలో లిప్ లాక్ సీన్ ఉందని మొదట తనకు చెప్పలేదని, ఆ రోజు షూటింగ్ వెళ్లిన తర్వాతే అక్కడ లిప్ లాక్ సన్నివేశం ఉందని ఆమె తెలిపారు. అయితే తొలుత దీనిపై తనతో లిప్ లాక్ చేయనున్న సజీవ్‌ కుమార్‌‌తో చర్చించానని, అతను నాకులాగే ఏం మాత్రం టెన్షన్ పడటం లేదని సురభి చెప్పుకొచ్చారు.

అయితే ఆయనకు సిగరెట్‌ తాగే అలవాటు ఉందని, దీంతో ఆ షాట్‌కు ముందు అతనిని పళ్ళు తోముకుని తిరిగి రావాలని కోరానని వెల్లడించింది. అంతేకాదు సెట్‌లోని ఫుడ్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్లను పిలిచి యాలకులు కొని తీసుకురావాలని చెప్పానని.. షాట్‌ కు ముందు వాటిని నోట్లో వేసుకుని కాసేపు నామిలానని చెప్పుకొచ్చింది. అలా ఈ లిప్ లాక్ సన్నివేశాన్ని పూర్తి చేసినట్టు నటి సురభి వెల్లడించింది. ముద్దు సన్నివేశంలో ఆమె థియేటర్లలో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించింది. అందువల్లే ఆ లిప్‌లాక్‌ సీన్‌ ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+