త్రిష సంచలన పోస్ట్ ..దేవుడు ఆశీర్వదిస్తాడంటూ

హీరోయిన్ త్రిష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 20 ఏళ్లుగా హీరోయిన్‌గా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో త్రిష నటించింది. ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. మహేష్ బాబు, ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి టాప్ హీరోల సరసన నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. యంగ్ హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడంతో త్రిష హవా తగ్గిపోయింది.

అయితే త్రిష ఇటీవలే మళ్లీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. పొన్నియర్ సెల్వం రెండు పార్ట్‌ల్లో అలరించిన త్రిష, తమిళ స్టార్ హీరో విజయ్ , లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లియో సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం చిరంజీవి సరసన 'విశ్వంభర' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. . సూర్య కొత్త సినిమాలో కూడా త్రిషనే హీరోయిన్‌గా తీసుకున్నారు. త్రిష తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తోంది. 41 ఏళ్ల వచ్చినప్పటికీ తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తోంది. ఇదే సమయంలో తమిళ స్టార్ హీరోతో విజయ్‌తో త్రిష రిలేషన్‌ కూడా ఆమెను వార్తల్లో నిలిచేలా చేసింది.

Actress trisha storing counter to social media posts

ఇదిలా ఉంటే త్రిష తాజాగా తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. త్రిష తన పోస్ట్‌లో ఈ విధంగా రాసుకొచ్చారు..'' విషపూరితమైన వ్యక్తులు ఉన్న ఈ సమాజంలో.. మీరు ఎలా జీవితాన్ని సాగిస్తారు.. ఎలా నిద్రపోతారు. సోషల్ మీడియాలో ఇతరుల గురించి రూమర్స్ క్రియేట్ చేసి అసంబద్ధమైన విషయాలను పోస్ట్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల నిజంగా భయంకరంగా అనిపిస్తుంది. నిజంగా ఇదంగా అజ్ఞాత పిరికితనం. దేవుడు మీ అందరినీ నిజంగా ఆశీర్వదిస్తాడు'' అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. దీనికి ఓ సాడ్ ఎమోజీని కూడా జత చేసింది. అయితే త్రిష ఎవర్ని ఉద్దేశించి ఈ పోస్ట్‌ను షేర్ చేశారో అర్థం కావడం లేదు.

ఇక త్రిష వ్యక్తిగత జీవితానికి వస్తే..ఆమె ఓ బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది. నిశ్చితార్థం వరకు వెళ్లిన వీరి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. అప్పటి నుంచి త్రిష సింగిల్‌గానే ఉంటోంది. అయితే ఇటీవల త్రిష, ఇళయ దళపతి విజయ్‌లకు సంబంధించి ఓ రూమర్ తెర మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. విజయ్ , త్రిష రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు, విజయ్ బర్త్ డేకు త్రిష విషెష్ చెప్పడం, ఆ తర్వాత విజయ్ కోసం త్రిష తొలిసారి ఐటం సాంగ్ చేయడం అన్నీ కూడా వీరి రిలేషన్‌ను బహిర్గతం చేశాయి. ఇటీవలే వీరిద్దరు కలిసి స్పెషల్ ఫ్లైయిట్‌లో హీరోయిన్ త్రిష పెళ్లికి హాజరవ్వడం జరిగింది. అయితే ఈ రూమర్లపై ఇద్దరు కూడా స్పందించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+