రెండు రోజుల్లో ఆత్మహత్య, కారణం ఆ రాజకీయ నాయకుడే, నటి వీడియో వైరల్, మేడమ్ ?
ఇది నా చివరి వీడియో. ఇక రెండు రోజుల్లో నేను ఆత్మహత్య చేసుకుంటాను. నేను కర్ణాటకలో ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధం అయ్యాను. నాకు ఇలాంటి వీడియో చేయాల్సి వస్తుందని నాజీవితంలో ఎప్పుడూ అనుకోలేదని, ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చిందంటే తనకు ఎంతో బాధగా ఉందని, తన ఆత్మహత్యకు ఆయనే కారణం అంటూ బహుబాష నటి విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియో విడుదల చేసింది.
ఈ రోజు నేను ప్రజలకు అన్నీ చెబుతున్నాను, తన ఆత్మహత్యకు అతనే కారణం అంటూ కన్నడ, తమిళ, తెలుగు సినిమాల్లో నటించిన ప్రముఖ నటి విజయలక్ష్మి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ రాజకీయ నాయకుడు, నటుడు, దర్శకుడు సీమాన్‌పై నటి విజయలక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు. సీమాన్ కారణంగా తాను ఏడు సార్లు గర్భం దాల్చానని ఇంతకు ముందే నటి విజయలక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు.

నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) పార్టీ వ్యవస్థాపకుడు అయిన సీమాన్ మీద బహుబాష నటి గతంలో కూడా విజయలక్ష్మి అనేక ఆరోపణలు చేశారు. ఇప్పటికే తనకు సీమాన్ తో వివాహం జరిగిందని, ఆయన తనకు ఏడు సార్లు అబార్షన్ చేయించాడని గత కొంతకాలంగా నటి విజయలక్ష్మి సంచలన ఆరోపణలు చేస్తూనే ఉంది. ఇటీవలి కాలంలో వివాదాల కారణంగా వార్తల్లో ఉంటున్న నటి విజయలక్ష్మి ఈ తరహా వీడియోలు చేసి ఆమెకు పరిచయం ఉన్న అందరిలోనూ ఆందోళన కలిగించింది.
తనను సీక్రేట్ గా పెళ్లి చేసుకున్న సీమాన్ తనను మోసం చేశాడని నటి విజయలక్ష్మి ఆరోపణలు చేస్తోంది. నా సోదరుడికి వచ్చిన ఓ సమస్య కారణంగా నేను మొదటిసారి సీమాన్‌ని కలుసుకున్నాను. అయితే అప్పటికి సీమాన్‌కి పెళ్లి కాలేదని, తరువాత తనతో పరిచయం, చనువు పెంచుకున్న తరువాత నన్ను పెళ్లి చేసుకుంటానని అతను తనను నమ్మించాడు అని విజయక్ష్మి ఆరోపించారు. నాతో మూడు సంవత్సరాలు ఎంజాయ్ చేసిన తరువాత సీక్రేట్ గా పెళ్లి చేసుకుని తనతో గుట్టుగా కాపురం కూడా చేశాడని నటి విజయలక్ష్మి ఆరోపించారు.
తరువాత తనను మళ్లీ అందరి ముందు పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో కాపురం చేసి ఇప్పటి వరకు ఏడు సార్లు అబార్షన్ చేయించాడని నటి విజయలక్ష్మి సీమాన్ మీద పదేపదే ఆరోపణలు చేస్తూనే ఉంది. తాను సీమాన్ తో ఒక్కసారి మాట్లాడాలని ఇటీవల విజయలక్ష్మి ఓ వీడియో విడుదల చేసింది. అయితే ఈ విషయంలో ఇంత వరకు సీమాన్ స్పందించలేదు. ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటానని మరో వీడియో చేసిన విజయలక్ష్మి దానిని సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

ఇదే నా చివరి వీడియో ఇక రెండు రోజుల్లో తాను ఆత్మహత్య చేసుకుంటాను. నేను కర్ణాటకలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించానని సీమాన్ మీద పలు ఆరోపణలు చేసిన విజయలక్ష్మి విడుదల చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఇప్పటికే సీమాన్ మీద నటి విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కూడా విచారణకు హాజరుకావాలని సీమాన్ కు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు తాను ఆత్మహత్య చేసుకుంటానని నటి విజయలక్ష్మి మరో వీడియో చేసి విడుదల చెయ్యడం కలకలం రేపింది.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications