అతనితో ఎఫైర్ పెట్టుకుని తప్పు చేశా..స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ఓ స్టార్ హీరోయిన్ తన ఎఫైర్ గురించి తానే బయటపెట్టుకుంది. ఆ భామ మరెవ్వరో కాదు తమిళ స్టార్ హీరోయిన్ ఆండ్రియా జెర్మియా. మొదట తమిళ సింగర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఆండ్రియా జెర్మియా.. తరువాత లిరిక్ రైటర్‌గా మారింది. ఆ తరువాత హీరోయిన్ అవతారం ఎత్తింది. స్టార్ హీరోల సరసన నటిస్తూ తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. ఆండ్రియా పేరు చెప్పగానే మొదటిగా గుర్తుకు వచ్చేది ఆమె అందాలే.
తెర మీద ఆండ్రియా రెచ్చిపోయి రొమాన్స్ చేస్తోంది. తన అందాలను ఆరబోతతో అభిమానులను అలరిస్తుంటుంది. ఇక ఆ మధ్య సెక్స్ గురించి నేరుగానే మాట్లాడి సంచలనం సృష్టించింది. ఆండ్రియా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో ఓ వ్యక్తి వల్ల పడిన ఇబ్బందుల గురించి వెల్లడించింది. ఓ పెళ్లైన వ్యక్తితో తాను ఎఫైర్ పెట్టుకున్నాను. అతను నన్ను శారీరకంగా చాలా హింసించాడని ఈ అమ్మడు తెలిపింది. అతని టార్చర్ భరించలేక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని తెలిపింది.

ప్రస్తుతం అతని నుంచి దూరంగా ఉంటున్నానని ఆండ్రియా తెలిపింది. సింగర్ అనిరుధ్‌తో కూడా ఆండ్రియా ఎఫైర్ సాగించిందన రూమార్స్ వచ్చాయి. వీరిద్దరు చాలా క్లోజ్‌గా ఉన్న ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తనకు ఎప్పటికీ పెళ్లి చేసుకోవాలని లేదని తెలిపింది. 20-25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ ఆ సమయంలో కుదరలేదు. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకుంటే సంతోషిస్తానని కాదు, పెళ్లి కాకపోయినా చాలా సంతోషంగా ఉంటానని చెప్పుకొచ్చింది. 40 ఏళ్ల వయసులో సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది












Click it and Unblock the Notifications