అడివి శేష్ కామెంట్లతో రగులుతున్న టాలీవుడ్: ఆ అహంకార హీరో ఎవరు?
ప్రముఖ నటుడు అడివి శేష్ చేసిన కామెంట్లు ఇప్పుడు టాలీవుడ్ యువ హీరో మధ్య పెను తుఫానును రేపుతున్నాయి. సుమారు మూడేళ్ల విరామం తర్వాత 'డెకాయిట్' సినిమాతో ఈ వారాంతంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అడివి శేష్.. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఓ స్టార్ హోదా ఉన్న యువ హీరో తనను తక్కువ చేసి మాట్లాడారని అడివి శేష్ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఆ యువ హీరో ఎవరు?
వివారాల్లోకి వెళ్తే.. ఓ నిర్మాత పుట్టినరోజు వేడుకలో తానొక యువ హీరోను కలిశానని, అప్పుడు ఆ హీరో తనతో వ్యంగ్యంగా మాట్లాడుతూ.. "శేష్, నువ్వు కూడా నా సినిమా అంత పెద్ద సినిమానే చూస్తున్నావుగా!" అని అన్నాడని అడివి శేష్ చెప్పుకొచ్చాడు. తనను కించపరిచేలా ఆ హీరో అలా మాట్లాడటం తనకు బాధ కలిగించిందని అడివి శేష్ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు ఆ హీరో ఎవరై ఉంటారా అని ఊహించుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ, నాని, నిఖిల్ సిద్ధార్థ్, తేజ సజ్జా, విశ్వక్ సేన్, నితిన్ వంటి హీరోల పేర్లను సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. వారిలో ఒకరు అహంకారంతో ఈ మాటలు అని ఉంటారని నెటిజన్లు ఊహిస్తుండటంతో అనవసరంగా ఆ హీరోలపై నెగిటివిటీ పెరుగుతోంది. ఈ పరిణామం పట్ల టాలీవుడ్‌లోని ఓ యువ హీరో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

స్పందించిన యువహీరో
సదరు హీరో ఈ విషయంపై స్పందిస్తూ.. "ఈ వివాదంతో నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా, సోషల్ మీడియాలో నా పేరును లాగడం చాలా బాధ కలిగిస్తోంది. అడివి శేష్ చేసిన కామెంట్స్ ఇతర యువ హీరోలపై అనవసరమైన నెగిటివిటీని సృష్టించాయి. దీనివల్ల మాకు సంబంధం లేని నష్టాన్ని మేము ఎదుర్కోవాల్సి వస్తోంది" అని ఆ యువహీరో వాపోయారు. అడివి శేష్‌ను క్లారిఫికేషన్ ఎందుకు అడగలేదని ప్రశ్నించగా.. "జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయింది. ఇప్పుడు మాట్లాడి ప్రయోజనం ఏముంది? సంబంధం లేని విషయాల్లో తలదూర్చుడం నాకు ఇష్టం లేదు" అని అడివి శేష్ సమాధానమిచ్చాడు.
"A hero said to me that, Sesh when do you make movies as big as mine ?"
— CineAura (@CineAuraX) April 4, 2026
Who do you think that hero is ? pic.twitter.com/0rijQQfqJy
మొత్తానికి 'డెకాయిట్'చిత్రం విడుదలకు ముందు అడివి శేష్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్త చర్చకు దారితీశాయి. ఒకరిపై ఒకరు ట్రోల్స్ చేసుకోవడానికి ఇది నెటిజన్లకు ఆయుధంగా మారింది. సినిమా ప్రమోషన్ల కోసం చేసినా లేదా నిజంగా బాధపడి చేసినా, ఈ కామెంట్స్ ఇప్పుడు తోటి హీరోలను ఇరకాటంలో పడేశాయన్నది వాస్తవం.












Click it and Unblock the Notifications