థియేటర్లలో బ్యాన్ చేస్తే ఓటీటీలో దుమ్ము లేపుతోంది.. !
థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తున్న వేళ, ఇప్పటికే రిలీజైన సినిమాలు ఓటీటీల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తెలుగు, తమిళం, హిందీతో పాటు హాలీవుడ్ సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రకరకాల జోనర్లలో అందుబాటులో ఉన్నా యి. అయితే, ఈసారి ఓటీటీలో వచ్చిన ఒక రొమాంటిక్ సినిమా మాత్రం బోల్డ్ కంటెంట్‌తో సంచలనం సృష్టిస్తోంది.
సాధారణంగా హారర్, థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీల్లో మంచి క్రేజ్ ఉంటుంది. కానీ, తాజాగా తెలుగు ఓటీటీ సంస్థ 'ఆహా' లో విడుదలైన ఒక సినిమా మాత్రం 'బోల్డ్' కంటెంట్‌తో రచ్చ రచ్చ చేస్తోంది. ఆ సినిమా పేరే 'ఎవోల్'.

ఈ సినిమాలోని బోల్డ్ సన్నివేశాలు మరీ శృతిమించి ఉండటంతో, దీనిని థియేటర్లలో విడుదల చేయకూడదని సెన్సార్ బోర్డు నిర్ణయించింది. సెన్సార్ బోర్డుకు షాక్ ఇచ్చేంతగా ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ ఉన్న కారణంగా, థియేటర్ రిలీజ్‌కు బ్యాన్ పడింది.
థియేటర్లలో బ్యాన్ అయినప్పటికీ, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు సెన్సార్ నిబంధనలు పెద్దగా సమస్య కాకపోవడంతో, దర్శకుడు రామ్ వెలగపూడి డైరెక్ట్ చేసిన ఈ తెలుగు సినిమాను ఇప్పుడు ఆహాలోకి తీసుకువచ్చారు.
ఇప్పటివరకు ఆహా ఓటీటీలో ఈ రేంజ్ బోల్డ్ సన్నివేశాలున్న సినిమాను స్ట్రీమింగ్ చేయలేదు. అందుకే 'ఎవోల్' సినిమా హాట్ టాపిక్‌గా మారింది. థియేటర్లలో సెన్సార్ కాటుకు బలైపోయిన ఈ రొమాంటిక్ బోల్డ్ మూవీ, ఓటీటీలోకి అడుగుపెట్టింది మొదలు యువ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ స్ట్రీమింగ్‌లో దూసుకుపోతోంది.
ఈ సినిమా టైటిల్ ఎంత డిఫరెంట్‌గా ఉందో, కంటెంట్ కూడా అంతే భిన్నంగా ఉండడంతో, బోల్డ్ కంటెంట్ కోరుకునే ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 'ఎవోల్' ఇప్పుడు ఆహాలో చూడొచ్చు.












Click it and Unblock the Notifications