ఇంత బోల్డ్‌గా ఉందేంటి.. ఈ సినిమా!

బోల్డ్ కంటెంట్, సామాజిక అంశాల కలబోతగా 2024లో సంచలనం సృష్టించిన చిత్రం 'హాట్ స్పాట్'. ఆంథాలజీ ఫార్మాట్‌లో వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌గా 'హాట్ స్పాట్ 2 మచ్' (Hot Spot 2 Much) సిద్ధమైంది. మొదటి భాగం 'ఆహా' ఓటీటీలో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో, ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

దర్శకుడు విఘ్నేష్ కార్తిక్ ఈ సీక్వెల్‌ను కూడా సామాజిక ముసుగులను తొలగించే మూడు ప్రధాన కథలతో ఆసక్తికరంగా మలిచారు.స్టార్ హీరోల అభిమానుల మధ్య జరిగే గొడవలు ఎంతటి దారుణాలకు దారితీస్తాయో ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపించారు. తన కొడుకును ఫ్యాన్ వార్స్‌లో కోల్పోయిన తండ్రిగా ఎం.ఎస్. భాస్కర్ పండించిన నటన, ఆయన ఇచ్చే స్పీచ్ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది.

Aha Premieres Hot Spot 2 Much The Highly Anticipated Sequel to the Viral Social Satire is Finally Available for Streaming

అమ్మాయిల దుస్తుల విషయంలో సమాజం చూసే కోణంపై దర్శకుడు గట్టి సెటైర్ వేశారు. తండ్రిగా తంబి రామయ్య, కూతురిగా నటించిన నటి మధ్య సాగే ఈ కథలో వచ్చే ఒక ట్విస్ట్ ప్రేక్షకులను షాక్‌కు గురి చేస్తుంది.2050 నుంచి టైమ్ ట్రావెల్ చేసి వచ్చిన ఒక అమ్మాయితో సాగే ప్రేమకథ ఇది. భవిష్యత్తు గురించి ఇందులో వేసిన జోకులు నవ్వులు పూయిస్తాయి, అయితే దీని క్లైమాక్స్ మాత్రం ఊహించని విధంగా చాలా బోల్డ్‌గా ఉంటుంది.

యూత్ లో Hot Spot 2

ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్, అశ్విన్ కుమార్, భవాని శ్రీ, ఆదిత్య భాస్కర్ వంటి యువ నటులతో పాటు తంబి రామయ్య, ఎం.ఎస్. భాస్కర్ వంటి అనుభవజ్ఞులు కీలక పాత్రలు పోషించారు. అనిల్ రెడ్డి ఎం, ముని చంద్రారెడ్డి ఎన్, ఇందుకుమార్ ఎం నిర్మించిన ఈ చిత్రాన్ని విష్ణు విశాల్ స్టూడియోస్ సమర్పించింది.

జనవరి 23న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సుమారు రూ. 3.3 కోట్ల గ్రాస్ వసూలు చేసి, మొదటి భాగం కంటే మెరుగైన ఫలితాన్ని అందుకుంది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించినప్పటికీ, దర్శకుడు ఎంచుకున్న పాయింట్స్ బాగున్నాయని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Hot Spot 2 సరికొత్త రికార్డు

ప్రస్తుతం ఈ చిత్రం ఒకేసారి ఆరు ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. ఫిబ్రవరి 20 నుండి తమిళం (సబ్-టైటిల్స్‌తో), హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే, తెలుగు వెర్షన్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఒక శుభవార్త.. ఈ చిత్రం ఫిబ్రవరి 27న 'ఆహా' వేదికగా తెలుగులో కూడా విడుదల అయింది.

బోల్డ్ అండ్ సోషల్ సెటైర్ చిత్రాలను ఇష్టపడే వారు, సమాజంలోని సున్నితమైన అంశాలను విభిన్న కోణంలో చూడాలనుకునే వారు 'హాట్ స్పాట్ 2 మచ్'ను తప్పక వీక్షించవచ్చు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+