బయటపడ్డ ఐశ్వర్యరాయ్ ఎఫైర్..అతనికి పబ్లిక్‌గా ముద్దులు

బాలీవుడ్‌లో బెస్ట్ కపూల్ అంటే అందరికి ఠక్కున గుర్తుకు వచ్చేది అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ జంట. 2007లో ఐశ్వర్యరాయ్,అభిషేక్ బచ్చన్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది. 16 ఏళ్లు బాగానే సాగిన కాపురంలో గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్న సంగతి అందరికి తెలిసిందే.

ఈ వార్తలకు బలం చేకూర్చేలా బచ్చన్ ఫ్యామిలీ వ్యవహరించడంతో అందరూ ఇది నిజమే అని నిర్థారణకు వచ్చేశారు. ఇదే సమయంలో బిగ్ బి అమితాబ్ తన కొడలు ఐశ్వర్యరాయ్‌ను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశారు. ఇది చూసిన నెటిజన్లు ఐశ్వర్యరాయ్ - అభిషేక్ బచ్చన్‌ విడాకులు తీసుకుంటున్నారని.. అందుకే అమితాబ్ ఐశ్వర్యరాయ్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేశారని చర్చించుకున్నారు. తాము కలిసే ఉన్నామని విడాకులు తీసుకోవడం లేదని ఐశ్వర్యరాయ్ క్లారిటీ ఇస్తూ ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసినప్పటికి ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు.

Aishwarya Rai is rumored to be in close contact with a doctor named Zirak Marker

అంబానీ ఇంట జరిగిన పెళ్లి సమయంలో కూడా అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ విడాకుల ప్రస్తావన తెర మీదకు వచ్చింది. ఫొటో సెషన్‌లో భాగంగా బచ్చన్ ఫ్యామిలీతో కాకుండా ఐశ్వర్యరాయ్ ఒక్కరే ఫొటోలు దిగడంతో మరోసారి ఈ జంట విడాకుల గురించి చర్చ నడిచింది. ఈ ఘటన తర్వాత ఐశ్వర్యరాయ్ కూతురుతో కలిసి ఒంటిరిగా విదేశాలకు వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. ముంబై విమానాశ్రయంలో ఐశ్యర్య, ఆరాధ్య మాత్రమే కనిపించడం, అభిషేక్ బచ్చన్ లేకపోవడం మరోసారి ఈ జంట విడాకులు గురించి చర్చకు వచ్చింది.

ఇదిలా ఉంటే ఐశ్వర్యరాయ్ ఓ వ్యక్తితో క్లోజ్‌గా మూవ్ అవుతోందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఐశ్వర్యరాయ్‌ జిరాక్ మార్కర్ అనే ఓ డాక్టర్‌తో సన్నిహితంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ స్నేహం ప్రస్తుతం వేరే రిలేషన్‌గా మారిందని కొంతమంది బాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు. ఇక రీసెంట్‌గా ఆ డాక్టర్‌తో కలిసి ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఐశ్వర్య.. ఆయనకు ముద్దులు పెట్టడంతో దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో చాలా వైరల్ అవుతున్నాయి.

దీంతో ఐశ్వర్య ఆ డాక్టర్‌తో రిలేషన్‌లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ విడాకులకు కారణం ఆ డాక్టర్ అవుతారని కొంతమంది భావిస్తున్నారు.అయితే జిరాక్ మార్కర్ ఐశ్వర్యరాయ్‌‌కు కాలేజ్ ఫ్రెండ్ అని తెలుస్తోంది. వీరిద్దరు కాలేజ్ డేస్ నుంచి కూడా మంచి ఫ్రెండ్స్‌గా కొనసాగుతున్నారని ఐశ్వర్యరాయ్‌ సన్నిహితులు చెబుతున్నారు. అంతే కానీ వీరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని వారు క్లారిటీ ఇస్తున్నారు. మరి దీనిపై అభిషేక్ ఎలా రియాక్ట్ అవుతాబో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+