శారీరకంగా, మానసికంగా వేధించాడు, నా జీవితంలో చెత్త రోజులు - ఐశ్వర్య రాయ్

గత కొద్దిరోజులుగా ఐశ్వర్యరాయ్ వ్యక్తిగత జీవితం గురించి అనేక కథనాలు వెలువడుతున్నాయి. ఐశ్వర్యరాయ్ తన భర్త,బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌తో విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. 2007లో ఐశ్వర్యరాయ్,అభిషేక్ బచ్చన్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది. 16 ఏళ్లు బాగానే సాగిన కాపురంలో గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్న సంగతి అందరికి తెలిసిందే.

తాము కలిసే ఉన్నామని విడాకులు తీసుకోవడం లేదని ఐశ్వర్యరాయ్ క్లారిటీ ఇస్తూ ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసినప్పటికి ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు. ఇదే సమయంలో ఐశ్వర్యరాయ్ ఓ వ్యక్తితో క్లోజ్‌గా మూవ్ అవుతోందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఐశ్వర్యరాయ్‌ జిరాక్ మార్కర్ అనే ఓ డాక్టర్‌తో సన్నిహితంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ స్నేహం ప్రస్తుతం వేరే రిలేషన్‌గా మారిందని కొంతమంది బాలీవుడ్ జనాలు చర్చించుకున్నారు. అయితే అతను ఐశ్వర్యరాయ్ చిన్ననాటి స్నేహితుడని ఆమె సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ హీరోయిన్ కారణంగా ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్‌ వైవాహిక జీవితంలో విభేదాలు చోటు చేసుకున్నాయని రూమర్స్ తెర మీదకు వస్తున్నాయి. అభిషేక్ బచ్చన్‌ లైఫ్‌లోకి మరో మహిళ రావడం వల్లే వీరి మధ్య గొడవలు జరిగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దస్వి సినిమాలో నటి నిమ్రత్ కౌర్‌తో అభిషేక్ బచ్చన్‌ క్లోజ్‌గా మూవ్ అవుతున్నాడని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

Aishwarya Rai made shocking comments on her relationship with Salman Khan

వీరిద్దరూ రిలేషన్‌షిప్ పెట్టుకున్నారని తెలిసి ఐశ్వర్య గొడవ పెట్టుకుందని అంటున్నారు. ఆ తర్వాత వీరి వైవాహిక బంధంలో సమస్యలు మరింత తీవ్రమయ్యాయని రీసెంట్ రెడిట్‌ పోస్టులో ఆరోపించారు. అయితే అలాంటిది ఏమీ లేదని బచ్చన్ ఫ్యామిలీ సన్నిహితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఐశ్వర్య రాయ్ ఓ ఇంటర్య్వూలో పాల్తొన్న సమయంలో తన సల్మాన్‌ ఖాన్‌తో ఉన్న బంధాన్ని గురించి యాంకర్ ప్రశ్నించారు. దానికి ఐశ్వర్య రాయ్ స్పందిస్తూ.. నేను సల్మాన్‌ ఖాన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వచ్చింది. మద్యం సేవించి సల్మాన్ అనుచితంగా ప్రవర్తించేవాడు. ఇది నా జీవితంలోని చెత్త దశగా నేను భావిస్తాను. అతను నన్ను శారీరకంగా, మానసికంగా వేధించాడు. దీంతో అప్పుడే నేను అతనితో విడిపోయానంటూ క్లారిటీ ఇచ్చింది. సల్మాన్ గురించి ఐశ్వర్య రాయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+